Tuesday, March 31, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్ఆలయ భూములు కౌలు వేలం పాట

ఆలయ భూములు కౌలు వేలం పాట

- Advertisement -

రూ.4 లక్షల 35 వేలకు దక్కించుకున్న ఏ. అవినాష్
నవతెలంగాణ – మద్నూర్

మద్నూర్ మండలంలోని మేనూరు గ్రామంలో గల హనుమాన్ ఆలయ భూములు మంగళవారం మేనూరు గ్రామపంచాయతీ ఆవరణంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ అధికారులు ఆలయ కమిటీ సమక్షంలో కౌలు వేలంపాట నిర్వహించారు. ఈ వేలం పాటలో సలాబత్పూర్ ఆంజనేయస్వామి దేవాలయ ధర్మాదాయ శాఖ ఆలయ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ మేనూర్ హనుమాన్ ఆలయ కమిటీ చైర్మన్ విట్టల్ గురూజీ గ్రామ సర్పంచ్ అశోక్ పటేల్ ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. రూ. 10 వేల చొప్పున డిపాజిట్ చెల్లించి కౌలు దారులు వేలంపాటలో పాల్గొన్నారు. ఈ వేలంపాటలో ఏ. అవినాష్ రూ.4 లక్షల 35 వేలకు దక్కించుకున్నారు. వ్యవసాయదారుల అంచనాల ప్రకారం ఎకరాకు రూ.31 వేల చొప్పున దేవాదాయ భూములు కౌలు వచ్చినట్లు చర్చించుకున్నారు. దక్కించుకున్న వ్యక్తి 50 శాతం డబ్బులు వెంటనే చెల్లించినట్లు దేవాదాయ శాఖ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ శ్రీధర్ తెలిపారు. ఈ వేలం పాటలో దేవాదాయ శాఖ అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -