అనన్య క్రియేషన్స్ బ్యానర్ పై కైలాష్ దుర్గం నిర్మిస్తున్న చిత్రం ‘తెరచాప’. జోయల్ జార్జ్ దర్శకుడు. నవీన్ రాజ్ శంకరపు, పూజ సుహాసిని, శ్రీలు ముఖ్యపాత్రలో నటించారు. ఈ సినిమా ఈనెల 17వ తేదీన విడుదల కానున్న సందర్భంగా చిత్ర బృందం ఘనంగా ప్రీ రిలీజ్ వేడుకను నిర్వహించారు.
నటుడు రాజీవ్ కనకాల మాట్లాడుతూ, ‘నిర్మాత కైలాష్ ఎంతో కష్టపడి తన సొంతదైన డబ్బును మా పై, జార్జ్ పై, అలాగే నవీన్ పై ఉన్న నమ్మకంతో సినిమా చేశారు. ఈ సినిమాలో నాతోపాటు ఎందరో సీనియర్ నటులు నటిం చారు. అలాగే కొత్త వారు కూడా నటించారు. మండే ఎండలో సముద్ర తీరాన ఇసుకలో చెప్పులు లేకుండా నటించడం అనేది ఎంతో కష్టమైన పరిస్థితి. అటువంటి పరిస్థితులలో కూడా నవీన్ రాజ్ చాలా కష్టపడి నటించారు. శారీరకంగానే కాకుండా మానసిక ఒత్తుడులు ఎన్ని ఉన్నా కూడా ఆయన వాటిని ఎదిరించి నిలబడ్డారు. అంత కష్టపడి నటించినా ఈ సినిమాను తన తండ్రికి అంకితం చేస్తున్నాను అని నాతో అన్నప్పుడు నేను ఎంతో ఆనంద పడ్డాను’ అని తెలిపారు.
‘నాకు సినిమాలు అంటే చాలా ఇష్టం. కేవలం కథ నచ్చి ఈ సినిమా చేశాను. ఒక సినిమా చేయాలి అంటే నిర్మాతకు చాలా బలమైన సంకల్పంతో పాటు కుటుంబ బలం కూడా ఉండాలి. నాకు అలా బలంగా నిలబడిన నా కుటుంబానికి ధన్యవాదాలు తెలుపు కుంటున్నాను. మా సినిమాను ప్రేక్షకులంతా ఆదరించి, ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటున్నాను’ అని నిర్మాత కైలాష్ దుర్గం చెప్పారు. దర్శకుడు జార్జ్ మాట్లాడుతూ, ‘ఈ సినిమా కచ్చితంగా ప్రేక్షకులను అలరిస్తుందనే నమ్మకం ఉంది’ అని తెలిపారు.
వైవిధ్యమైన కథతో ‘తెరచాప’
- Advertisement -
- Advertisement -



