Saturday, August 9, 2025
E-PAPER
spot_img
Homeసినిమాతెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు : టీఎఫ్‌పీసీ

తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు : టీఎఫ్‌పీసీ

- Advertisement -

2024కి సంబంధించి తెలుగు సినిమాలకు, ఆయా సంబంధిత విభాగాలలో, అలాగే 2014 నుంచి 2023 వరకు ఉత్తమ చిత్రాలకు గద్దర్‌ తెలంగాణ ఫిల్మ్‌ అవార్డులను తెలంగాణ ప్రభుత్వం ప్రకటించడం పట్ల తెలుగు ఫిల్మ్‌ ప్రొడ్యూసర్స్‌ కౌన్సిల్‌ సంతోషం వ్యక్తం చేసింది. వీటితోపాటు ప్రత్యేక ఆరుగురికి ఆవార్డులను (ఒక్కొక్కరికి రూ. 10 లక్షల నగదు బహుమతితో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం) ప్రకటించడం అభినందనీయం. మాగంటి మురళీమోహన్‌ అధ్యక్షతన కమిటీ ఏర్పాటు చేసినందుకు తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్‌ రెడ్డికి, ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్కకి, రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డికి, టీఎఫ్‌డీసీ చైర్మన్‌, నిర్మాత వి.వెంకటరమణ రెడ్డి (దిల్రాజు)కి, డాక్టర్‌ ఎస్‌. హరీష్‌కి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తోందని టీఎఫ్‌పీసీ గౌరవ కార్యదర్శి టి. ప్రసన్నకుమార్‌ చెప్పారు. ఎన్టీఆర్‌ జాతీయ చలనచిత్ర అవార్డును నందమూరి బాలకష్ణకి, పైడి జైరాజ్‌ చలనచిత్ర అవార్డును దర్శకుడు మణిరత్నంకి. బి.ఎన్‌.రెడ్డి చలనచిత్ర అవార్డును దర్శకుడు సుకుమార్‌కి, నాగి రెడ్డి మరియు చక్రపాణి చలనచిత్ర అవార్డును నిర్మాత అట్లూరి పూర్ణచంద్ర రావుకి, కాంతారావు చలనచిత్ర అవార్డును హీరో విజరు దేవరకొండకి, రఘుపతి వెంకయ్య చలనచిత్ర అవార్డును రచయిత యండమూరి వీరేంద్రనాథ్‌కి ప్రత్యేక అవార్డులు రావడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా వీరందరికి తెలుగు చలన చిత్ర నిర్మాతల మండలి హదయపూర్వక అభినందనలు అని ప్రసన్నకుమార్‌ తెలిపారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img