- Advertisement -
నవతెలంగాణ – కామారెడ్డి
కామారెడ్డి కి చెందిన ప్రభుదాస్ ఉపాధ్యాయుడు ఇటీవల నిర్వహించిన తెలంగాణ రాష్ట్ర అర్హత పరీక్ష (TG-SET)లో ఉత్తీర్ణత సాధించారు. ఆయన బోధనలో ప్రత్యేక నైపుణ్యం కలిగి ఉండి, విద్యార్థులకు స్ఫూర్తిగా నిలుస్తున్నారు. ప్రస్తుతం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న ప్రభుదాస్, ఈ పరీక్షలో విజయాన్ని సాధించడం ద్వారా తన ప్రతిభను మరోసారి చాటుకున్నారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, మిత్రులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు. ప్రభుదాస్ మాట్లాడుతూ, తన విజయానికి కృషి, పట్టుదలే కారణమని, భవిష్యత్తులో కూడా విద్యా రంగంలో మరింత సేవ చేయాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు.
- Advertisement -



