Wednesday, November 5, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈని నిలదీసిన తండావాసులు

విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని ఏఈని నిలదీసిన తండావాసులు

- Advertisement -

నవతెలంగాణ – హుస్నాబాద్ రూరల్ 
హుస్నాబాద్ మండలంలోని బల్లు నాయక్ తండాలో వ్యవసాయ ట్రాన్స్ఫార్మర్ , ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో విద్యుత్ సమస్యలు పరిష్కరించాలని చెప్పిన ఏఈ పట్టించుకోవడంలేదని మంగళవారం హుస్నాబాద్ లోని విద్యుత్ కార్యాలయంలో ఏఈ మల్లేశం ను ఇస్లావత్ కవిత, రాజన్ , హరిలాల్ , రాజు ,బీమా నిలదీశారు. ఇందిరమ్మ ఇంటి నిర్మాణానికి విద్యుత్ లైన్లు అడ్డుగా ఉన్నా వాటిని తొలగించేందుకు డబ్బులు ఎందుకు ఇవ్వాలని అడిగారు. వ్యవసాయ బావుల వద్ద ఉన్న ట్రాన్స్ఫార్మర్ కాలిపోతే పట్టించుకోవడం లేదన్నారు. దీంతో మల్లేశం మాట్లాడుతూ.. నేను ఎవరిని డబ్బులు అడగలేదని, లైన్ సిఫ్టింగ్ కోసం డీడీ ఖర్చులు అవుతాయని చెప్పానని తెలిపారు. తండాలో విద్యుత్ సమస్యలు రెండు రోజుల్లో పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. రెండు రోజుల్లో విద్యుత్ సమస్యలు పరిష్కరించకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -