Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeసినిమాదట్‌ ఈజ్‌ మెగాస్టార్‌..

దట్‌ ఈజ్‌ మెగాస్టార్‌..

- Advertisement -

మహౌన్నతమైన వ్యక్తిత్వం, ఎనలేని సేవాతత్వంతో కోట్లాది మంది అభిమానుల గుండెల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించిన చిరంజీవి మరోసారి తన మానవత్వాన్ని చాటారు.
ఆంధ్రప్రదేశ్‌లోని ఆదోని పట్టణానికి చెందిన చిరంజీవి వీరాభిమాని రాజేశ్వరి, మెగాస్టార్‌ని కలవాలనే కలతో సైకిల్‌పై హైదరాబాద్‌కు సాహసోపేత ప్రయాణం మొదలుపెట్టారు. ఎన్నో శారీరక, మానసిక సవాళ్లు ఎదురైనా చిరంజీవిపై ఉన్న అపారమైన అభిమానమే ఆమెను విజయవంతంగా ముందుకు నడిపింది. దాదాపు 300 కిలోమీటర్లకు పైగా సైకిల్‌ తొక్కుతూ హైదరాబాద్‌కు చేరుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న చిరంజీవి ఆమెను ఆప్యాయంగా తన ఇంటికి ఆహ్వానించారు. ఆమె అంకితభావానికి, తనను చేరుకోవడానికి చేసిన కషికి చలించిపోయిన ఆయన ఆమెకు ఒక చిరస్మరణీయ జ్ఞాపకాన్ని ఇచ్చారు. రాజేశ్వరితో రాఖీ కట్టించుకుని, ఆమెకు ఆశీస్సులు అందించారు. అంతేకాదు ఓ అందమైన చీరను బహుమతిగానూ ఇచ్చారు.
అలాగే రాజేశ్వరి పిల్లల విద్య కోసం, వారి భవిష్యత్‌లో వెలుగునింపడం కోసం పూర్తి స్థాయిలో ఆర్థిక సహాయం అందించనున్నట్లు హామీ ఇచ్చారు.
తన అభిమానులను కేవలం అభిమానులుగానే కాకుండా కుటుంబ సభ్యుల్లా చూసుకునే చిరంజీవి గొప్ప మనసుకు ఇది మరొక ఉదాహరణగా నిలిచి, దట్‌ ఈజ్‌ మెగాస్టార్‌ అనిపించేలా చేసింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad