అగ్ర కథానాయకుడు ప్రభాస్ నటిస్తున్న చిత్రం ‘రాజా సాబ్’. మారుతి దర్శకత్వంలో పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తోంది. ఈ మూవీ ట్రైలర్‌ను సోమవారం సాయంత్రం మేకర్స్ రిలీజ్ చేశారు.
‘ఈ ట్రైలర్ కోసం ప్రభాస్ ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఎంతగానో ఎదురుచూస్తున్నారు. వారి వెయిటింగ్‌కు తెరదించుతూ అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్‌తో మా ‘రాజా సాబ్’ ట్రైలర్ పండుగ ఫీస్ట్‌ను అందిస్తూ రిలీజైంది. ఫన్, ఫియర్‌తో పాటు వింటేజ్ ప్రభాస్‌ను ఆల్ట్రా స్టైలిష్‌గా చూపించిన ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ప్రభాస్‌ను ఒక హిప్నాటిస్ట్ ఓ భారీ హవేలీలోకి తీసుకెళ్తడంతో ట్రైలర్ ప్రారంభమవుతుంది. అక్కడ అనూహ్య ఘటనలు చోటు చేసుకుంటాయి. దానికి కారణం తాత (సంజయ్ దత్). సైకలాజికల్‌గా అన్ని విద్యలు తెలిసి, ప్రేతాత్మలను నియంత్రిస్తూ బ్రెయిన్‌తో గేమ్ ఆడుకునే ఆ తాత శక్తిని ఎదుర్కోవడం ఆసాధ్యం. ‘అభీ దేఖ్ లీజియో…’ అంటూ ఆ దుష్టశక్తిని ఎదుర్కొనేందుకు రాజా సాబ్‌గా హవేలీలోకి అడుగుపెడతాడు ప్రభాస్.
ఆ తర్వాత ఏం జరిగింది అనేది ట్రైలర్‌లో ఆసక్తికరంగా చూపించారు. డైరెక్టర్ మారుతి తను ప్రామిస్ చేసినట్లే రొమాంటిక్ హర్రర్ కామెడీ జోనర్‌లో వింటేజ్ ప్రభాస్‌తో ఒక ఫుల్‌మీల్స్ లాంటి మూవీని హోల్ సమ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందించినట్లు ట్రైలర్ ప్రూవ్ చేస్తోంది. వచ్చే సంక్రాంతి పండగ సందర్భంగా జనవరి 9న వరల్డ్ వైడ్‌గా ఈ సినిమా థియేట్రికల్ రిలీజ్‌కు రాబోతోంది అని చిత్ర యూనిట్ తెలిపింది. నిధి అగర్వాల్, మాళవిక మోహనన్, రిద్ది కుమార్, సంజయ్ దత్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి ఎడిటింగ్ – కోటగిరి వెంకటేశ్వరరావు, సినిమాటోగ్రఫీ – కార్తీక్ పళని, మ్యూజిక్ – తమన్, ఫైట్ మాస్టర్ – రామ్ లక్ష్మణ్, కింగ్ సోలొమన్, ప్రొడక్షన్ డిజైనర్ – రాజీవన్, క్రియేటివ్ ప్రొడ్యూసర్ – ఎస్ కేఎన్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ – టీజీ కృతి ప్రసాద్, కో ప్రొడ్యూసర్ – వివేక్ కూచిభొట్ల, ప్రొడ్యూసర్ – టీజీ విశ్వప్రసాద్, రచన, దర్శకత్వం – మారుతి.
ఆ.. దుష్ట శక్తిని ఎదుర్కొనే ‘రాజా సాబ్’
- Advertisement -
- Advertisement -