అంకిత్ కొయ్య, నీలఖి జంటగా నటించిన చిత్రం ‘బ్యూటీ’. ఏ మారుతి టీం ప్రొడక్ట్, వానరా సెల్యూలాయిడ్, జీ స్టూడియో బ్యానర్లపై విజయ్ పాల్ రెడ్డి అడిదల, ఉమేష్ కుమార్ భన్సల్ సంయుక్తంగా నిర్మించారు. జె.ఎస్.ఎస్. వర్దన్ దర్శకత్వం వహించారు. ఈ చిత్రం ఇటీవల విడుదలై బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన నేపథ్యంలో మేకర్స్ సక్సెస్ మీట్ నిర్వహించారు. నటుడు వీకే నరేష్ మాట్లాడుతూ, ”బ్యూటీ’లోని సోల్ ఆడియెన్స్‌కి కనెక్ట్ అవుతోంది. దర్శక, నిర్మాతలకు సినిమా రిలీజ్ కంటే ముందే శాలువా కప్పేశాను. ఈ చిత్రం బ్లాక్ బస్టర్ అవుతుందని నాకు ముందే తెలుసు. నా కెరీర్‌లో 350 సినిమాలు చేశా. ఈ చిత్రానికి వచ్చిన రివ్యూలు నా జీవితంలో ఇంత వరకు రాలేదు. లవ్, ఎమోషన్స్, ఫ్యామిలీ.. ఇలా అన్ని రకాల అంశాలతో ఈ మూవీని ఆదరిస్తున్న ప్రతీ ఒక్కరికీ థ్యాంక్స్’ అని అన్నారు. ‘మా సినిమా అందరికీ రీచ్ అయింది. క్లైమాక్స్ తరువాత అందరూ కన్నీళ్లు తుడుచుకుంటున్నారు. అదే మా విజయం. నేను నటించిన ఏ మూవీ కూడా ఏ ఒక్కరినీ నిరాశపర్చలేదు.
అంకిత్ కొయ్య అంటే మినిమం గ్యారెంటీ అనేది పక్కా’ అని హీరో అంకిత్ కొయ్య చెప్పారు. డైరెక్టర్ జె.ఎస్.ఎస్ వర్ధన్ మాట్లాడుతూ,’మా మూవీ ప్రతీ ఒక్కరినీ ఎంటర్టైన్ చేస్తోంది. ఇప్పటి వరకు 15 థియేటర్లను విజిట్ చేశాను. ప్రతీ ఒక్కరూ మూవీని ఎంజాయ్ చేస్తున్నారు’ అని తెలిపారు. ‘మా సినిమా ఇప్పటికే కమర్షియల్‌గా సక్సెస్ అయింది. ప్రతీ ఒక్కరూ ఫోన్ చేసి ప్రశంసిస్తున్నారు. అద్భుతమైన మూవీ అని, గుండె బరువెక్కిందని మాట్లాడుతున్నారు. మీడియా, ఆడియెన్స్ ఇలా అందరూ గొప్పగా ఆదరిస్తున్నారు. మన జీవితాలకు ప్రతీకగా నిలిచే చిత్రమిది. ఇది కేవలం సినిమా కాదు.. జీవితం’ అని నిర్మాత విజయ్ పాల్ రెడ్డి అన్నారు. హీరోయిన్ నీలఖి మాట్లాడుతూ,’మా మూవీని ఇంతలా ఆదరిస్తున్న అందరికీ థ్యాంక్స్. నా పాత్రపై, అలాగే సినిమా కంటెంట్‌పై ప్రశంసలు కురిపిస్తున్న అందరికీ ధన్యవాదాలు’ అని చెప్పారు.
అదే.. మా ‘బ్యూటీ’ విజయం
- Advertisement -
- Advertisement -