ఓడిపోయిన వారం రోజులకే నన్ను పోలీసులు అరెస్టు చేశారు..
కాంగ్రెస్ పార్టీ నాయకుల దాడిలో గాయపడి ఆస్పత్రిలో చేరినా.. ఎవరూ స్పందించలేదు
ఏం జరిగిందని ఒక్కరు కూడా నన్ను అడగలేదు
అనుచరుల సమావేశంలో గువ్వల బాలరాజు
నవతెలంగాణ – అచ్చంపేట
ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయిన వారం రోజులకే తనను, తన సతీమణిని అచ్చంపేటలో ఒక కార్యక్రమానికి వస్తుండగా వెల్దండలోనే పోలీసులు అరెస్టు చేశారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు నాపై దాడి చేశారు. ఆస్పత్రి పాలైనా.. పార్టీలో ఏ నాయకుడు ఏం జరిగింది? ఎందుకు అరెస్ట్ చేశారు అని కనీసం అడగలేకపోయారు. ఫామ్ హౌస్ కేసులో రూ.100 కోట్లకు అమ్ముడుపోయాడని రాష్ట్రవ్యాప్తంగా రాజకీయం పార్టీలలో చర్చ జరిగింది.
ఇది వాస్తవం కాదని కనీసం ఒక్క ప్రకటన చేయలేకపోయారు. అందుకే రాజీనామా చేయవలసి వచ్చిందని మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు బుధవారం తన నివాసంలో ఏర్పాటు చేసిన అనుచరుల సమావేశంలో అన్నారు. బీజేపీ కాంగ్రెస్ పార్టీలో ఒక వర్గం గురించి మాట్లాడతాయని, బీజేపీ దేశం కోసం అంటుంది. కాంగ్రెస్ పార్టీ గరీబ్ హఠావ్ నినాదం తీసుకొచ్చింది. మరి ప్రజలు, పౌరులను ఎవరు పట్టించుకోవాలన్నారు. అచ్చంపేట రాజకీయంగా నాకు జన్మనిచ్చిందని, జిల్లా ప్రజలు, నల్లమల్ల ప్రజల అభిప్రాయాలు, సలహాలు తీసుకున్నాను. ప్రజల సమస్యలు పరిష్కరించే ధృక్పథం గల పార్టీలో చేరుతారని తెలిపారు.
ఏ రాజకీయ పార్టీలో చేరుతాను అనేది రెండు రోజుల్లో వెల్లడిస్తానని తెలిపారు. కచ్చితంగా నాలుగు గోడల మధ్యన ఏ పార్టీలో చేరనని, బహిరంగంగా ప్రజల సమక్షంలో పార్టీలో చేరుతానని ఆయన వెల్లడించారు.
నన్నూ నా భార్యను అరెస్టు చేసినా ఎవరూ స్పందించలేదు: మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES