- Advertisement -
- సీఐటీయు, ఏఐటీయూసీ
నవతెలంగాణ-భువనగిరి: తెలంగాణ రాష్ట్రంలోని అన్ని వాణిజ్య సంస్థలలో రోజుకు 10 గంటలకు తగ్గకుండా పని చేయడానికి తెలంగాణ ప్రభుత్వం అనుమతిస్తూ జీఓ ఇవ్వడాన్ని సీఐటీయు జిల్లా కార్యదర్శి కల్లూరి మల్లేశం, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎండీ ఇమ్రాన్ తీవ్రంగా వ్యతిరేకించారు. తక్షణమే ఈ జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. ఆదివారం జాయింట్ ప్లాట్ ఫారమ్ ఆఫ్ ట్రేడ్ యూనియన్ సమావేశాన్ని జిల్లాకేంద్రంలోని సీఐటియు కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. నరేంద్ర మోడీ ప్రభుత్వం తీసుకువచ్చిన లేబర్ కోడ్ లను బలపరుస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం..అన్ని వాణిజ్య సంస్థలలో వారానికి 48 గంటలు అంటే రోజుకు 10 గంటలు తగ్గకుండా ఉద్యోగులు పనిచేయాలని ప్రభుత్వం జీఓ విడుదల చేయడంతో కార్మికులను బానిసలుగా మార్చే కుట్ర ఉందని ఆరోపించారు. ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రేపు అన్ని కేంద్ర, రాష్ట్ర కార్మిక సంఘాల ఆధ్వర్యంలో జీవో కాపీలను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయాలు, లేబర్ ఆఫీస్ ల వద్ద నిరసన తెలిపి, వినతి పత్రం ఇవ్వాలన్నారు. రాష్ట్ర కమిటిలు ఇచ్చిన పిలుపును జిల్లాలోని అన్ని కేంద్రాలలో కార్యక్రమాలను జయప్రదం చేయాలన్నారు.ఈ సమావేశంలో సిఐటియు జిల్లా అధ్యక్షులు దాసరి పాండు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు గోరేటి రాములు, నాయకులు గణబోయిన వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
- Advertisement -