- Advertisement -
కార్యదర్శి బాబురావు
నవతెలంగాణ- మద్నూర్
డోంగ్లి సహకార సంఘంలో ఈ నెల 20న 61వ మహాజన సభ నిర్వహించబడుతుందని సహకార సంఘం కార్యదర్శి బాబురావు ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. ఈ మహాజన సభ విజయవంతానికి సంఘ పరిధిలోని సంఘ సభ్యులకు, రైతు రైతులకు ఆయన ప్రత్యేకంగా విజ్ఞప్తి చేశారు. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం డోంగ్లిలో ఈ సమావేశం ఉదయం ఉదయం 11 గంటలకు సంఘం పర్సన్ ఇంచార్జ్ అధ్యక్షులు సిహెచ్. లక్ష్మీనారాయణ, సీనియర్ ఇన్స్పెక్టర్ అధ్యక్షతన ప్రారంభమవుతుందని తెలిపారు. సంఘ పరిధిలోని రైతు సోదరులందరూ సకాలంలో హాజరవ్వాలని కోరారు.
- Advertisement -



