Monday, January 19, 2026
E-PAPER
Homeదర్వాజమృత్యు లోగిలి

మృత్యు లోగిలి

- Advertisement -

ఏందిరా అయ్యా
రేకలవారంగా ఇంటి పూల చెట్టు మీద
కాకి అరుపుకు ఏదో కబురు తెచ్చింది
చుట్టమస్తుండు అనుకుంటే ముంగిట్ల
ముగ్గులు గొబ్బెమ్మలతో సింగారించుకుంటే
పిల్లి ఎదురొచ్చి పెండముగ్గుల తొక్కిపోయింది
ఏంది పీడ ఏమై ఉంటది నాతిరి తెల్లారి గొట్టంగా కల వచ్చింది

కలల కలల పెళ్లి పందిట్ల బాజా భజంత్రీలు వచ్చే అది సావు కల
దీనమ్మ ఏందిరా అయ్యా శకునం అయ్యింది ఇంటి ముంగల ఏదో జరుగుతుంది
అదేదో కుక్కల ఏడుపు నక్క ఊలవేస్తే తిన్నది అరగనట్ట చావును ముందే పసిగట్టినట్టా? ఏమో?..
మృత్యు బై రూపుల వేషంతో ఆట పూటకో తీరు రోజుకో తీరు
తీరు అంతా తెలిసినట్టే ఉంటది ఎప్పుడు గద్దలేక కోడి పిల్లను మింగుదామా అని ఇది చావు ఆట
మృత్యు క్రీడ వేయి కనులు లక్ష కాళ్ళు ఇంటి చుట్టూతా
పందికొక్కుల్లా కన్నాలు వేసి అదే పనిగా కావాలి గాస్తున్నయి..

ఏమి జరుగుతుందో వాడకు ఎరుక ఊరుకు ఎరుక దేశానికి ఎరుక
ఏమీ జరగనట్టు ఏమీ ఎరగనట్టు నటన లోకం నటన
అబ్బా ఆస్కార్‌ అవార్డు దిగదుడుపేఅంతా అయిపోయాక అయ్యో పాడుగాను అంతేనా
అయ్యో పాపం అన్ని గుమ్మాలకు తొంగి చూస్తది
ట్రంపు వెనిజులా నేతను అపహరించినట్టు అందరూ చూస్తారు ఎవరూ నోరు మెదపరు
అబద్ధాలు ఊరేగుతూనే ఉంటాయి టీవీలలో విరామం లేకుండా
స్క్రోలింగ్‌ చేస్తుంటాయి గగ్గోలు పెడుతుంటాయి

కావలసిన కార్యం గంధర్వులు తీర్చినట్టు నియంతలకు స్వామి కార్యం స్వకార్యం
అమ్ముడుపోయిన బంటులు వేగులు మాజీలు నాజీలు నూకల కోసం బ్యారాలు కుదుర్చుకుంటున్నాయి
స్మశానంలో నిప్పుల కొలిమి రాజుకునే ఉంది, అక్కడ మృత్యువు పిట్ట సంకేతాలు ఇస్తూనే ఉంది
క్షితి ఎక్కకుండానే దేహాలు మాయం వేడివేడి వార్తలు ఈరోజు వార్త రేపు కనుమరుగు ఇది కదా అయ్యా
నడుస్తున్న చరిత్రలో ఈరోజు వాడి వంతు రేపు నీ వంతు బిడ్డ జాసకు ఉంచుకో..

  • భూతం ముత్యాలు
- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -