Saturday, December 20, 2025
E-PAPER
Homeతెలంగాణ రౌండప్దళిత యువతిపై లైంగిక దాడి చేసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి

దళిత యువతిపై లైంగిక దాడి చేసి చంపిన నిందితులను కఠినంగా శిక్షించాలి

- Advertisement -

కెవిపిఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ డిమాండ్
నవతెలంగాణ – కాటారం

మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట మండలం, వేముల గ్రామంలో డిసెంబర్ 17న రాత్రి దళిత యువతి ప్రవళిక (22)ను ఎత్తుకెళ్లి లైంగిక దాడి చేసి, హత్య చేసిన దుండగులను తక్షణమే అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని కేవీపీఎస్ జిల్లా అధ్యక్షుడు ఇసునం మహేందర్ డిమాండ్ చేశారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ.. మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు ముగిసిన తర్వాత వేముల గ్రామంలో కాంగ్రెస్ పార్టీ ర్యాలీ సందర్భంగా ఆ ర్యాలీలో పాల్గొన్న దళిత యువతి ప్రవళిక(21)ను ఆ ర్యాలీ నుండి ప్రవళికను, ఆధిపత్య కులానికి చెందిన విష్ణు అనే వ్యక్తి అతని స్నేహితులు రైతు వేదిక పక్కన ఉన్న చెట్ల పొదల్లోకి లాక్కెళ్లి సామూహిక లైంగికదాడి చేశారు.

రక్తస్రావం అయి స్పృహ కోల్పోయిన ఆమెను హత్య చేశారనీ చెప్పారు. విష్ణు అతని స్నేహితులు ముగ్గురు పైన హత్య కేసు ,అత్యాచారం కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేసి కటినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసులు కేసు నమోదు చేయకుండా పోస్టుమార్టం రిపోర్ట్ తర్వాత కేసు నమోదు చేస్తామని చెప్పడం, కేసును పక్కదారి పట్టించడమేనని చెప్పారు. అధికార పార్టీ నాయకులు వారి కార్యకర్తలను కాపాడడానికి, పోలీసులపై ఒత్తిడి తెచ్చి కేసు నమోదు కాకుండా చేస్తున్నారని విమర్శించారు. 

 జిల్లా కలెక్టర్ ఎస్పీ ఆ గ్రామాన్ని సందర్శించి బాధిత కుటుంబానికి ధైర్యం చెప్పి న్యాయం చేయాలని వారు డిమాండ్ చేశారు. బహిరంగ సభ జరుగుతున్న స్థలము నుంచి ఒక మహిళను కిడ్నాప్ చేసి ఇంత దారుణంగా అత్యాచారం చేసి హత్య చేస్తే, కేసు నమోదు చేయకుండా కాలయాపన చేయడం దుర్మార్గమని చెప్పారు పోలీసులు ఎస్సీ ఎస్టీ చట్టా నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు 

 ఈ ఘటనపై సమగ్ర విచారణ చేసి నిందితులందరిని వెంటనే అరెస్టు చేయాలన్నారు. ప్రవళిక కుటుంబానికి 3ఎకరాల భూమి, ఆ కుటుంబంలో ఒకరికి ఉద్యోగం 30లక్షల ఎక్స్ గ్రేషియో ఇవ్వాలని ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేయాలని డిమాండ్ చేశారు. లేనట్లయితే రాష్ట్రవ్యాప్తంగా ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -