Tuesday, March 3, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంరైతు సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యం

రైతు సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యం

- Advertisement -

– వ్యవసాయ యాంత్రీకరణ పథకంలో సబ్సిడీపై వ్యవసాయ డ్రోన్ల పంపిణీ
– మొదటి దశలో జిల్లాకు 10 చొప్పున పంపిణీ : మంత్రి
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

రైతులకు సాగు ఖర్చులు తగ్గించి ఆదాయం పెంచడమే లక్ష్యంగా తమ ప్రజా ప్రభుత్వం పనిచేస్తున్నదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తెలిపారు. సోమవారం ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో వ్యవసాయ రంగంలో యాంత్రీకరణను వేగవంతం చేసేందుకు ఎస్‌ఎమ్‌ఏఎమ్‌ పథకం కింద పలు వ్యవసాయ యంత్రాలను సబ్సిడీపై అందజేస్తున్నామని తెలిపారు. ఆధునిక సాంకేతిక వ్యవసాయాన్ని ప్రోత్సహించే దిశగా మొదటి దశలో ప్రతి జిల్లాకు 10 చొప్పున వ్యవసాయ డ్రోన్లను 40 శాతం సబ్సిడీతో, గరిష్టంగా రూ.4 లక్షల వరకు వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు, ప్రాథమిక సహకార సంఘాలకు అందజేస్తామని తెలిపారు. వ్యవసాయ డ్రోన్ల వినియోగంతో పిచికారీ సమయం 70-80 శాతం వరకు తగ్గడంతో పాటు ఎరువులు, సూక్ష్మపోషకాలు సమానంగా పంటపై పిచికారీ చేయడం సాధ్యమవుతుందనీ, కూలీల ఖర్చు తగ్గి రైతులకు లాభం పెరుగుతుందని వివరించారు. రాష్ట్రంలో ఆయిల్‌పామ్‌ సాగును ప్రోత్సహిస్తున్నామని పేర్కొన్నారు. ఉద్యానవన పంటల అభివద్ధి కోసం పసుపు ఉడకపెట్టే యంత్రాలు, పసుపు పాలిషింగ్‌ యంత్రాలు, ఆయిల్‌ పామ్‌ కోతకు టెలిస్కోపిక్‌ హార్వెస్టింగ్‌ పోల్‌, ఇతర ఉద్యానవన పంటల కోత పరికరాలను కూడా సబ్సిడీ పథకంలో చేర్చిందని మంత్రి తెలిపారు. ఈ పథకానికి సంబంధించిన అర్హతలు, సబ్సిడీ శాతం మరియు దరఖాస్తు విధానం వంటి వివరాలు జిల్లా వ్యవసాయ కార్యాలయాలలో అందుబాటులో ఉంటాయని చెప్పారు. 2025-26లో ఇప్పటివరకు మొత్తం 9936 వ్యవసాయ యంత్రాలను రూ.28.74 కోట్ల సబ్సిడీపై రైతులకు ఇచ్చామనీ, రానున్న 10 -15 రోజుల్లో మిగతావన్నీ రైతులకు అందజేస్తామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -