నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని పెద్ద ఎక్లార గ్రామంలో అఖండ శివనామ సప్త ఆరో రోజుకు చేరింది. ఈ సప్త కార్యక్రమంలో ప్రత్యేక పూజలు జరిపారు. ఆరవ రోజు దానే మారుతి ఆధ్వర్యంలో మహా అన్నదానం చేపట్టారు. ఈ సందర్భంగా కౌలాస్ మహారాజ్ ఆధ్వర్యంలో కీర్తన జరిగింది. ప్రతిరోజు భజన కీర్తనలు అన్నదాన కార్యక్రమాలు ప్రత్యేక పూజలు జరుగుతున్నాయి. శాంతి యుతంగా కలిసి మెలిసి భక్తి మార్గంలో నడిస్తే అలాంటి కుటుంబం ఆ దేవుని దయతో అభివృద్ధి పథంలో ముందుకు వెళ్తారని సూచించారు. రిటైర్డ్ మద్నూర్ సింగిల్ విండో చైర్మన్ బాబు పటేల్ తన బరువుకు తగ్గట్టుగా 91 కిలోల చక్కెర అందజేశారు. ఈ కార్యక్రమాలతో ఆ గ్రామంలో ప్రతిరోజు పండుగ వాతావరణం కనిపిస్తుంది. ఆదివారంతో ముగియనుంది. సోమవారం రోజున గ్రామానికి మహా అన్నదానం ఉంటుందని నిర్వాహకులు తెలిపారు.
ఆరోరోజుకు చేరిన అఖండ శివనామ సప్త
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



