హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న పాన్-ఇండియా చిత్రం ‘ఎస్‌ఎఫ్‌జీ’ (సంబరాల యేటిగట్టు)తో అద్భుతమైన సినిమాటిక్ అనుభవాన్ని అందించడానికి సిద్ధమవుతున్నారు. నూతన దర్శకుడు రోహిత్ కెపి దర్శకత్వంలో పాన్ ఇండియా బ్లాక్‌బస్టర్ ‘హనుమాన్’ను అందించిన ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్నారు. సాయి దుర్గ తేజ్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తూ, మేకర్స్ ‘అసుర ఆగమన’ గ్లింప్స్‌ను విడుదల చేశారు. హీరో సాయి దుర్గ తేజ్ మాట్లాడుతూ,’నేను ఈ స్టేజ్ మీద ఉండడానికి కారణమైన మా ముగ్గురు మామయ్యలు చిరంజీవి, కళ్యాణ్, నాగబాబుకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. నా లైఫ్‌లో చాలా ఇంపార్టెంట్ సినిమా ఇది. సినిమా మీ అందరికీ నచ్చుతుందని నమ్ముతున్నాను. మా నిర్మాతలు నిరంజన్, చైతన్య చాలా సపోర్ట్ చేశారు. కాస్ట్యూమ్ డిజైనర్ ఆయేషా ప్రతి క్యారెక్టర్‌కి దాదాపుగా 50 కాస్ట్యూమ్స్ చేశారు. గాంధీ అద్భుతంగా ప్రొడక్షన్ డిజైన్ చేశారు.
నా ‘విరూపాక్ష’ సినిమాకు మ్యూజిక్ చేసిన అజినీస్ ఈ సినిమాకి ఇచ్చిన మ్యూజిక్ అద్భుతంగా ఉంటుంది. డైరెక్టర్ రోహిత్ చాలా మంచి కథ రాసుకున్నారు. తన విజన్ మీ అందరికీ నచ్చుతుంది. సినిమా అవుట్ స్టాండింగ్‌గా ఉంటుంది. అతిథులుగా విచ్చేసిన దేవకట్టా, వశిష్ట, వివేక్, ఆనంద్‌కి థ్యాంక్స్. ఇది వండర్‌ఫుల్ ఫిల్మ్. అందరూ ఎంజాయ్ చేస్తారు. ఇది నా ప్రామీస్’ అని తెలిపారు. ‘మా హీరో సాయి దుర్గ తేజ్‌కి ఈ సినిమా చాలా పెద్ద సక్సెస్ అవ్వాలని కోరుకుంటున్నాను’ అని ప్రొడ్యూసర్ కె నిరంజన్ రెడ్డి చెప్పారు. ప్రొడ్యూసర్ చైతన్య రెడ్డి మాట్లాడుతూ,’టీజర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. సాయి అన్న ఈ సినిమా కోసం చాలా కష్టపడ్డారు. ఆయన మాకెంతో స్ఫూర్తినిచ్చారు’ అని అన్నారు. ‘ఈ సినిమా కోసం సాయి దుర్గ తేజ్ అయినంతగా ట్రాన్స్ఫర్మేషన్ మిగతా వారికి అంత ఈజీ కాదు. ఆయన బౌన్స్ బ్యాక్ అయిన విధానం వెరీ ఇన్స్పైరింగ్’ అని డైరెక్టర్ రోహిత్ తెలిపారు.
అసుర ఆగమనం..
- Advertisement -
- Advertisement -