కాపర్ తీగ, అయిల్ దొంగతనం..
నవతెలంగాణ – డిచ్ పల్లి
ఇందల్వాయి గ్రామ శివారులోని ఇ ట్టేడి బాల్ రెడ్డి వ్యవసాయ పంట పోలం లోని 16 కెవిఎ ట్రాన్స్ఫర్, మిట్టపల్లి కిషన్ పొలంలో గల 25 కెవిఎ ట్రాన్స్ఫార్మర్ లను రాత్రి ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు పంట పొలాల్లో రేండు ట్రాన్న్స్ఫార్మర్స్ కింద పడేసి అందులోని ఆయిల్, రాగి తీగలను దొంగిలించినట్లు తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఇందల్ వాయి ఏఈ పండరి నాథ్ పోలిసులకు ఫిర్యాదు చేసినట్లు ఎస్ హెచ్ ఓ జీ సందీప్ తెలిపారు. అధికారికంగా దాదాపు లక్షన్నర వరకు తెలంగాణ నార్తన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ నష్టం వాటిల్లిందని,గత కొన్ని రోజుల క్రితమే ఇట్టెడి బాల్ రెడ్డి వరి పంటను కోసి కోనుగోలు కేంద్రానికి తరలించాడు.
ఉదయం పంట పోలనికి వచ్చిన రైతులు ట్రాన్స్ఫర్ కింద పడవేసి ఉండగా ఏఈ పండరి నాథ్ కు సమాచారం అందజేశారు.విద్యుత్త్ శాఖ అధికారులు ఘటన స్థలానికి చేరుకుని ట్రాన్స్ఫర్ ను పరిశీలించి నష్టం అంచనా వేసినట్టు వివరించారు.ఈ సందర్భంగా ఏఈ మాట్లాడుతూ 24 గంటల పాటు విద్యుత్ సరఫరా ఉందని,గూర్తు తెలియని వ్యక్తులు అర్దరాత్రి సమయం లో ఒక కర్ర సహాయంతో విద్యుత్ సరఫరా నిలిపి వేసి ట్రాన్స్ఫర్ పైన ఉన్న ఫిజులను తోలగించి ట్రాన్స్ఫర్ ను కింద పడవేసి దానిలో ఉన్న రాగి తిగను,ఆయిల్ ను దోంగలించి పారిపోయినట్లు ఏఈ పండరి నాథ్ ఇచ్చిన ఫిర్యాదు లో పేర్కొన్నారు.



