Monday, September 22, 2025
E-PAPER
Homeఆదిలాబాద్విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి..

విగ్రహాలను ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేయాలి..

- Advertisement -

అడిషనల్ ఎస్పి, ఎస్సై, తాసిల్దార్ కు వినతి పత్రం అందజేత..
కుబీర్ మండల కురుమ కుల సంఘం..
నవతెలంగాణ – కుభీర్
లోకేశ్వరం మండలం రాయపూర్ కాండ్లీ లో బీరప్ప దేవుని విగ్రహాలను ధ్వంసం చేసిన ఘటనపై కుబీర్ మండల కురుమ కులస్తులు తీవ్ర అగ్రహం వ్యక్తం చేశారు. ఈ సంఘటనపై భైంసా అడిషనల్ ఎస్పి అవినాష్, ఎస్సై కృష్ణారెడ్డి, తాసిల్దార్ శివరాజ్ లకు కుబీర్ మండల  కురుమ కులస్తులు ఆయా పోలీస్ స్టేషన్లో, తాసిల్దార్ కార్యాలయంలో సోమవారం వినతి పత్రాలను అందజేశారు.

  ఈ సందర్బంగా దుండగులను తక్షణమే గుర్తించి అదుపులకు తీసుకొని కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. అలాగే ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాకుండా పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సాయినాథ్, నిమ్మ బీరు, డోలేవార్ కామాజీ, మాజీ ఉపసర్పంచ్ దత్తాత్రి, కుబీర్ సంఘం అధ్యక్షుడు దత్తాత్రి, డోలేవార్ పోతన్న, సాయినాథ్, బాబన్న, దేవన్న, టేకులవార్ బాలాజీ, నాగేష్, సాయినాథ్, ఈరన్న, ఆయా గ్రామ కురుమ కులస్తులు తదితరులు ఉన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -