నవతెలంగాణ- రాయపోల్ : రామ్ సాగర్ గ్రామంలో గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులను అరెస్టు చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందని తొగుట సిఐ షేక్ లతీఫ్ అన్నారు. శుక్రవారం రాయపోల్ పోలీస్ స్టేషన్ లో దుండగులను మీడియా ముందు ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల మూడవ తేదీన మంగళవారం రాత్రి సమయంలో రాంసాగర్ గ్రామస్తులైన శ్రీరామ్ సురేష్, రాగి రాము ఇద్దరూ కలిసి వారి గ్రామంలో జరిగిన సర్కస్ ను చూసి తిరిగి మద్యం సేవించి రాత్రి అందాజా 11:30 నిమిషాలకు రాము యొక్క ద్విచక్ర వాహనం పై సురేష్ తో కలిసి ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రధాన కూడలిలో ఉన్న గాంధీ విగ్రహాన్ని చూసుకుంటూ ఇట్టి విగ్రహం స్థానంలో వేరే విగ్రహం ఉంటే బాగుంటుందాని సురేష్ తో చెప్పగా సురేష్, రాము మాటలకు రెచ్చిపోయి అక్కడ గల రాయి తీసుకుని గాంధీ విగ్రహం ధ్వంసం చేయగా గాంధీ విగ్రహం యొక్క తల విరిగి వంగి పోయింది. సమాచారం తెలుసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని ముమ్మరంగా గాలిపు చర్యలు చేపట్టారు. శుక్రవారం రాయపోల్ ఎస్ఐ కుంచం మానస దుండగులు రాము, సురేష్ లను పోలీస్ స్టేషన్ కు తీసుకొని వచ్చి వారి నుంచి AP 24AK 6438 గల వాహనాన్ని స్వాధీనం పరుచుకున్నాము. వారిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయపోల్ ఎస్ఐ కుంచం మానస, ఏఎస్ఐ దేవయ్య, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
గాంధీ విగ్రహం ధ్వంసం చేసిన దుండగులు రిమాండ్ కు తరలింపు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



