బిసి అజాది పెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్
నవతెలంగాణ – మల్హర్ రావు: బీసీ బిల్లును అసెంబ్లీలో ఆమోదించినట్లుగా, పార్లమెంట్ లో ఆమోదించాలని బిసి అజాది పెడరేషన్ వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు జక్కని సంజయ్ కుమార్ కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వాంకిడి నుంచి అమలాపూర్ వరకు చేపట్టిన బిసి మేలుగోలుపు యాత్రలో భాగంగా మంథని నియోజకవర్గంలో రెండు రోజుల పాటు బీసీ మేలుకొలుపు యాత్ర చేపట్టిన నేపథ్యంలో ఆదివారం మండలంలోని కొయ్యుర్ గ్రామంలో బిసి మేలుగోలుపు యాత్ర ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. దేశ వ్యాప్తంగా శాస్ర్తీయ పద్దతిలో కుల గణన జరగాలని కోరారు. 8 సంవత్సరాలుగా కులగణన కోసం బిసి అజాది పేడరేషన్ పోరాటం చేస్తోందన్నారు. కుల గణనతో విద్య, వైద్య, ఉద్యోగ, రాజకీయ, ఆర్థికంగా బలోపేతం కావాలన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, వివిధ పార్టీల బీసీ సంఘం నేతలు, నాయకులు, కుల సంఘాల నాయకులు, బహుజన వాదులు పెద్ద సంఖ్యలో హాజరై విజయవంతం చేశారు.
బీసీ బిల్లును పార్లమెంట్ లో ఆమోదించాలి..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES