Tuesday, September 2, 2025
E-PAPER
spot_img
Homeతాజా వార్తలుమృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపలకు ఎగబడిన జనం..

మృగశిర కార్తె ఎఫెక్ట్.. చేపలకు ఎగబడిన జనం..

- Advertisement -

అందిన కాడికి దోసుకున్న వ్యాపారులు
నవతెలంగాణ – మల్హర్ రావు
: ఆదివారం మృగశిర కార్తె ప్రారంభం కావడంతో జనం చేపలకు ఎగబడ్డారు. ఇదే అదునుగా భావించిన మత్స్య వ్యాపారులు అందినకాడికి దండుకున్నారు. సాధారణంగా కిలో చేపలు రూ.100 నుంచి రూ.150 వరకు ఉంది. కానీ మృగశిర రోజున ప్రజలు ఎలాగైనా చేపల రుచి చూస్తారనే నేపథ్యంలో ఆదివారం ఉదయం 6 గంటలకే వ్యాపారులు మండలంలోని తాడిచెర్ల, మల్లారం, కొయ్యుర్ తదితర గ్రామాల్లోకి చేరుకొని కిలో చేపలు రూ.200 నుంచి రూ.250 వరకు విక్రయించారు. ఆనవాయితీగా ప్రతి సంవత్సరం మృగశిర రోజున తప్పకుండా చేపల పులుసు రుచి చూడాలి కాబట్టి వ్యాపారులు చెప్పిన ధరకు కొనుగోలు చేయక తప్పకపోవడంతో ప్రజలకు కిలో రూ.100 అదనంగా జేబుకు చిల్లు పడింది. సాయంత్రం వరకు ధర తగ్గకపోద్దా..కొందరు పేదలకు అసలుకే ఎసరు అన్నట్టుగా చేపలు కొరత ఏర్పడటంతో చేపల పులుసు రుచి చూడని పరిస్థితి ఏర్పడింది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad