ఇంటర్ వీడ్కోలు సమావేశం వక్తలు
నవతెలంగాణ – మద్నూర్
ఎంచుకున్న విద్యకు న్యాయం చేయండని, ఉత్తమ శ్రేణులతో విద్యార్థులు ఉత్తీర్ణులవ్వాలని, మంచి ఫలితాలు ఊపిరినింపుతాయని- పలువురు వక్తలు, ఉపన్యాసకులు పేర్కొన్నారు. మద్నూర్ మండల కేంద్రంలోని తెలంగాణ గురుకుల బాలుర విద్యాలయం,జూనియర్కళాశాలలోఇంటర్మీడియెట్ రెండవ సంవత్సరం విద్యార్థులకు ప్రథమ సంవత్సరం విద్యార్థులు వీడ్కోలు సమావేశమును ఏర్పాటు చేశారు. ఇంటర్ ఎంపీసీ,బైపీసీ విద్యార్థులు రెండు సంవత్సరాల కాలములో చదివిన, మధురాలను పంచుకున్నారు. వారి వారి అనుభూతులను ఉపన్యాసం రూపములో తెలిపారు. గురువులను పూజించి, సన్మానించారు.
ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ ఏ సుధాకర్, వైస్ ప్రిన్సిపాల్, ప్రముఖ పద్యకవి, సంస్కృతోపన్యాసకులు డా బి.వెంకట్ ల మాట్లాడారు. విద్యార్థులు దృఢ నమ్మకం, ఆత్మవిశ్వాసం, క్రమశిక్షణ, పట్టుదల, ఏకాగ్రతలను అలవరచుకోవాలన్నారు. మనమనుకున్న లక్ష్యానికి చేరాలంటే, ఆత్మవిశ్వాసం చాలా అత్యవసరమని అన్నారు. ఇంటర్ లో గల సంస్కృతం, తెలుగు, ఆంగ్లం, గణితం, జంతు, జీవ, భౌతిక, రసాయన శాస్త్రాలపై పట్టును సాధించాలన్నారు. విద్యార్థులు వారిదైనా నృత్యాలను చేయగా.. ఆకట్టుకొన్నాయి. అధ్యాపకులు -జి .రాము, బి.సుమన్, జే.గణేశ్, నరహరి, కే.సంతోశ్, గంగా ప్రసాద్, దత్తు, సంజు, ప్రవీణ్, రాచప్ప, నాగయ్య, పండరి, సాయిరాం, నరేశ్, బస్వరాజు, విద్యార్థులు, తదితరులు పాల్గొన్నారు.



