Saturday, September 27, 2025
E-PAPER
Homeజిల్లాలుబింగో సర్కస్ సందడే సందడి

బింగో సర్కస్ సందడే సందడి

- Advertisement -

103 మంది 30 రకాల ప్రదర్శనలతో సందడి
ప్రజలను ఆల్హాదా పరుస్తున్న బింగో సర్కస్
నవతెలంగాణ – కంఠేశ్వర్ 

నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటేశ్వర్ ప్రాంతంలో గల ఉమెన్స్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన బింగో సర్కస్ సందడే సందడి గా సాగుతుంది. నిజామాబాద్ లో మొట్ట మొదటిసారిగా బింగో సర్కస్ ప్రజలకు ఆల్హదపరుస్తుంది. చిన్నపిల్లల నుంచి మొదలుకొని పెద్దవారి వరకు సర్కస్ చూసేందుకు వస్తున్నారు. 103 మంది సర్కస్ ఆర్టిస్టులతో 30 రకాల ప్రదర్శనలతో ప్రజలను ఆకట్టుకుంటుంది.

కంటేశ్వర్ లో కొనసాగుతున్న బింగో సర్కస్ ప్రేక్షకులను రోజురోజుకు ఆకట్టుకుంటుంది. జిమ్నాస్టిక్, కామెడీ షో తో పాటు కళాకా రులు 30  రకాల ప్రదర్శనలు ఇస్తున్నారు. స్టంట్ మాస్టర్లు స్టంట్ చేస్తూ, రోలింగ్ ప్రదర్శన, రష్యన్ ఆర్టిస్టులతో పలు రకాల ప్రదర్శనలతో షో చూస్తున్న ప్రతి ఒక్కరిని  ఆకర్షిస్తున్నాయి. 103 మంది కళాకా రులతో మద్యాహ్నం 1గంటలకు, సాయంత్రం 4, 7 గంటలకు మూడు ఆటల్లో ఒక్కొక్క షో రెండు గంటలు కొనసాగుతోంది అని నిర్వాహకులు సునీల్, సంతోష్ తెలిపారు. 

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -