- Advertisement -
నవతెలంగాణ – మల్హర్ రావు : కాటారం మండలంలోని గంగారం గ్రామానికి చెందిన గ్రామ పంచాయతీ మల్టీపర్పస్ వర్కర్ పారిశుద్ధ్య కార్మికుడు మంతెన శ్రీనివాస్ కాళేశ్వర ముక్తేశ్వర సరస్వతి పుష్కరాలల్లో భాగంగా విధి నిర్వహణలో ఇటీవల మరణించాడు. మృతుని కుటుంబానికి మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మదుకర్ శనివారం పరామర్శించారు. అధైర్య పదోవద్దు.. బీఆర్ఎస్ అండగా ఉంటుందని తెలిపారు. అనంతరం మృతుని చిత్రపటానికి పూలు వేసి నివాళులర్పించారు. ఆయన వెంట బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఉన్నారు.
- Advertisement -