– గణతంత్ర దినోత్సవం వేడుకల్లో మహేశ్‌కుమార్‌గౌడ్
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ప్రజాస్వామ్య విలువలను తుంగలో తొక్కుతున్నారనీ, లౌకికవాదానికి బీజేపీ నేతలు తూట్లు పొడిచే కుట్రలు చేస్తున్నారని టీపీసీసీ అధ్యక్షులు మహేశ్‌కుమార్‌గౌడ్ విమర్శించారు. సోమవారం హైదరాబాద్‌లోని గాంధీభవన్‌లో నిర్వహించిన 77వ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆయన జాతీయ జెండా ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కేసీఆర్ హయాంలో ఆర్థిక విధ్వంసం జరిగిందని గుర్తు చేశారు. కేంద్రంలో 2014 వరకు యూపీఏ ప్రభుత్వం తీసుకొచ్చిన అన్ని సంక్షేమ పథకాలను ప్రస్తుత పాలకులు తొలగిస్తున్నారని విమర్శించారు. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, అగ్రనేతలు సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ సూచనలతో కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకుపోతున్నదని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి రాష్ట్రాన్ని ఆర్థిక విధ్వంసం నుంచి వికాసంవైపు నడిపిస్తున్నారని చెప్పారు. కులగణన సర్వేతో దేశంలోని అన్ని రాష్ట్రాలూ తెలంగాణ వైపు చూస్తున్నాయన్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. కులగణన బిల్లులను బీజేపీ అడ్డుకుంటోందని ఆరోపించారు. ఆ పార్టీ కుట్రలను ప్రజలు అర్థం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఈ వేడుకల్లో మంత్రి అజరుద్దీన్, మాజీ ఎంపీ వి. హనుమంతరావు, మాజీ మంత్రులు జే గీతారెడ్డి, జి.చిన్నారెడ్డి, సీనియర్ నేత కోదండరెడ్డి, ఎంపీ అనిల్‌కుమార్ యాదవ్, ఫిషరీస్ కార్పొరేషన్ చైర్మెన్ మెట్టుసాయికుమార్, ఖైతారాబాద్ జిల్లా అధ్యక్షులు మోతే రోహిత్ తదితరులు ఉన్నారు.
ప్రజాస్వామ్య విలువలకు, లౌకికవాదానికి బీజేపీ తూట్లు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



