ప్రభుత్వ లాంఛనాలతో అంతిమ యాత్ర
నవతెలంగాణ-సిటీబ్యూరో
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ ఎంపీ సురవరం సుధాకర్‌రెడ్డి (83) భౌతిక కాయాన్ని సికింద్రాబాద్ గాంధీ మెడికల్ కాలేజీకి ఆయన కుటుంబ సభ్యులు అప్పగించారు. సుధాకర్‌రెడ్డి అంతిమ యాత్ర ఆదివారం హైదరాబాద్‌లో ప్రభుత్వ అధికారిక లాంఛనాలతో నిర్వహించారు. హిమాయత్‌నగర్‌లోని సీపీఐ రాష్ట్ర కార్యాలయం మగ్ధూం భవన్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమైన అంతిమ యాత్ర నారాయణగూడ ఫ్లై ఓవర్ నుంచి చిక్కడపల్లి, ఆర్టీసీ క్రాస్ రోడ్స్, ముషీరాబాద్ మీదుగా గాంధీ మెడికల్ కళాశాల వరకు జరిగింది. అనంతరం వైద్య విద్యార్థుల పరిశోధన కోసం సుధాకర్‌రెడ్డి భౌతికకాయాన్ని అనాటమీ విభాగానికి అప్పగించారు. అంతిమయాత్ర సాగిన మార్గంలో రెడ్‌షర్ట్ వాలంటీర్లు కవాతు నిర్వహించారు. ప్రజానాట్యమండలి కళాకారులు కోలాటం, కర్రసాము, డప్పు విన్యాసాలతో స్ఫూర్తివంతంగా ప్రదర్శనలో పాల్గొన్నారు. ”సుధాకర్‌రెడ్డి అమర్ రహే, రెడ్ సెల్యూట్” అనే నినాదాలతో ఆ మార్గం మార్మోగింది. అంతిమ యాత్రకు అన్ని జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు, నాయకులు, కార్యకర్తలు ఎర్ర చొక్కాలు ధరించి భారీగా హాజరయ్యారు. గొప్ప కుమ్యూనిస్టు యోధుడు సుధాకర్‌రెడ్డి అని ఈ సందర్భంగా నాయకులు కొనియాడారు. మెడికల్ కాలేజీ వద్ద సురవరం భౌతిక కాయానికి మాజీ మంత్రులు హరీశ్‌రావు, శ్రీనివాస్‌గౌడ్, ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, చెరుకు సుధాకర్ నివాళులు అర్పించారు. అనంతరం సుధాకర్‌రెడ్డి కుటుంబ సభ్యులు, సీపీఐ జాతీయ ప్రధాన కార్యదర్శి డి.రాజా, జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, నాయకులు చాడ వెంకట్‌రెడ్డి, అజీజ్ పాషా తదితరులు సురవరం భౌతిక కాయాన్ని సాయంత్రం 5 గంటలకు గాంధీ మెడికల్ కాలేజీకి అప్పగించారు. ఉన్నత ఆశయంతో స్పందించిన సురవరం కుటుంబ సభ్యులకు, కమ్యూనిస్టు పార్టీలకు గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్, అధ్యాపకులు, వైద్య విద్యార్థులు ధన్యవాదాలు తెలిపారు.
ఎంబీ భవన్ వద్ద ‘సురవరం’కు ఘన నివాళి
మగ్ధూం భవన్ నుంచి ప్రారంభమైన సురవరం అంతిమయాత్ర ఆర్టీసీ క్రాస్ రోడ్డుకు చేరుకున్న సమయంలో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యాలయం ఎంబీ భవన్ వద్ద ఆయన భౌతికకాయానికి సీపీఐ(ఎం) నేతలు ఘన నివాళి అర్పించారు. సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ, ప్రజా సంఘాల రాష్ట్ర నాయకులు ఆశన్న, శ్రీరామ్ నాయక్, భూపాల్, స్కైలాబ్ బాబు, ఉడుత రవి, కోట రమేశ్, ఎంబీ భవన్ సిబ్బంది రవీందర్, నగర నాయకులు మహేందర్, బ్లాగరి పవన్ తదితరులు సుధాకర్‌రెడ్డి భౌతిక కాయంపై పూలు చల్లి నివాళ్లర్పించారు. సుధాకర్‌రెడ్డి ఆశయాలను కొనసాగించేందుకు వామపక్ష కార్యకర్తలు కృషి చేయాలని ఈ సందర్భంగా జాన్‌వెస్లీ పిలుపుని చ్చారు. అక్కడి నుంచి గాంధీ హాస్పిటల్ వరకు సాగిన ర్యాలీలో సీపీఐ(ఎం) నేతలు పాల్గొన్నారు.
‘గాంధీ’కి భౌతికకాయం అప్పగింత
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES