Monday, October 13, 2025
E-PAPER
Homeప్రధాన వార్తలుపుంజుకున్న రియల్‌ రంగం

పుంజుకున్న రియల్‌ రంగం

- Advertisement -

రాష్ట్రంలో నిర్మాణ రంగ వృద్ధిరేటు
11.97 శాతం పెరుగుదల
మూడు నెలల్లో ఏఐ సిటీకి భూమి పూజ : ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌

తెలంగాణ రియల్‌ ఎస్టేట్‌ రంగం 2024-25లో గణనీయమైన వృద్థి రేటు సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్‌ బాబు అన్నారు. నేషనల్‌ రియల్‌ ఎస్టేట్‌ డెవలెప్‌ మెంట్‌ కౌన్సిల్‌(నారెడ్కో) తెలంగాణ శాఖ ఆధ్వర్యంలో హైటెక్స్‌లో నిర్వహిస్తున్న ’15వ నారెడ్కో తెలంగాణ ప్రాపర్టీ షో’లో ఆయన ఆదివారం పాల్గొని ప్రసంగించారు. ‘2024-25లో రియల్‌ ఎస్టేట్‌, వ త్తిపరమైన సేవల రంగం 15.4 శాతం వ ద్ధి రేటును నమోదు చేసింది. 11.97 శాతం వ ద్ధి రేటుతో నిర్మాణ రంగం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు రూ.80వేల కోట్లకు పైగా సమకూర్చింది. స్టేట్‌ సర్వీసెస్‌ జీఎస్‌ డీపీలో ఈ రెండు రంగాల వాటానే 24.9 శాతంగా ఉంది’ అని అన్నారు. హైదరాబాద్‌, రంగారెడ్డి, మేడ్చల్‌ మల్కాజ్‌ గిరి జిల్లాల పరిధిలో 2024 సెప్టెంబర్‌లో రూ.2,820 కోట్ల విలువైన 4,903 ఇండ్ల రిజిస్ట్రేషన్లు జరిగాయన్నారు. గతేడాదితో పోల్చితే 35 శాతం అధికమని చెప్పారు. సెప్టెంబర్‌లో రూ.కోటిపైన విలువైన ఆస్తుల రిజిస్ట్రేషన్లలో 151 శాతం, మొత్తం విక్రయాల్లో విలువ పరంగా వీటి వాటానే 53 శాతంంగా ఉందని చెప్పారు. రాష్ట్రంలో రియల్‌ ఎస్టేట్‌ కుదేలయ్యిందంటూ దుష్ప్రచారం చేస్తున్న వారికి ధీటైన సమాధానమే ఈ గణాంకాలని పేర్కొన్నారు.

‘ఇండియాలో వ్యవసాయం తర్వాత ఎక్కువ మంది రియల్‌ ఎస్టేట్‌ రంగంలోనే ఉపాధి పొందుతున్నారు. అయితే… అభివృద్ధి చెందిన దేశాల జీడీపీలో స్థిరాస్తి రంగ వాటా సగటున 10 నుంచి 15 శాతం కాగా, చైనాలో అత్యధికంగా 23నుంచి 25 శాతం వరకుంది. మన దేశంలో ఇది 6 శాతం నుంచి 8 శాతమే. ఇది మరింత పెరగాల్సిన అవసరముంది’ అని శ్రీధర్‌బాబు అభిప్రాయపడ్డారు. ‘ఎలివేటెడ్‌ కారిడార్లు, మెట్రో ఫేజ్‌ 2, ఫ్యూచర్‌ సిటీ, మూసీ సుందరీకరణ, రీజినల్‌ రింగ్‌ రోడ్డు తదితర ప్రతిష్టాత్మక ప్రాజెక్టులతో తెలంగాణ రూపురేఖలు మారిపోనున్నాయి. డిసెంబర్‌ నాటికి ‘ఫ్యూచర్‌ సిటీ’లో జోనలైజేషన్‌ ప్రక్రియను పట్టలెక్కించాలనే పట్టుదలతో ఉన్నాం. అక్కడే 200 ఎకరాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేయనున్న ఏఐ సిటీకి మూడు నెలల్లోనే భూమి పూజ చేయబోతున్నాం’ అని వివరించారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలుస్తున్న రియల్‌ ఎస్టేట్‌ రంగానికి ప్రభుత్వం తరఫున అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నారెడ్కో తెలంగాణ ప్రతినిధులు విజయసాయి మేక, కాళీ ప్రసాద్‌ దామెర, డా.లయన్‌ కిరణ్‌, కె.శ్రీధర్‌ రెడ్డి, ఆర్‌.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -