Friday, February 27, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంపెత్తందారులను అరెస్టు చేయాలి

పెత్తందారులను అరెస్టు చేయాలి

- Advertisement -

బాధితులకు రూ.కోటి పరిహారం చెల్లించాలి : సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్‌ పార్టీ ఆధ్వర్యంలో నాగర్‌ కర్నూల్‌లో నిరసన

నవతెలంగాణ మహబూబ్‌నగర్‌ ప్రాంతీయ ప్రతినిధి

కుమ్మెర ఘటనలో పెత్తందారులను అరెస్టు చేయాలని, బాధితులకు కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించాలని సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సాగర్‌ డిమాండ్‌ చేశారు. నాగర్‌కర్నూల్‌ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌ చౌరస్తాలో బాధితులకు న్యాయం చేయాలని డిమాండ్‌ చేస్తూ సీపీఐ(ఎం) ఆధ్వర్యంలో నిరసన చేశారు. సందర్భంగా సాగర్‌ మాట్లాడుతూ కుమ్మెర గ్రామంలో పెత్తందారుల ఆగడాలు పెరిగిపోయాయన్నారు.

గ్రామ సర్పంచ్‌ తుకారాంరెడ్డిని, మిగతా నిందితులపై నమోదు చేసి అరెస్ట్‌ చేయాలని డిమాండ్‌ చేశారు. బాధితులను ఒంటరి చేయడానికి ప్రభుత్వ యంత్రాంగం ప్రయత్నం చేస్తుందని, ఇలాంటి ఎత్తుగడలు మానుకొవాలన్నారు. కార్యక్రమంలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి పర్వతాలు, కార్యదర్శి వర్గ సభ్యులు ఆర్‌ శ్రీనివాసు, జిల్లా నాయకులు పొదిలి రామయ్య, ఎం.శ్రీనివాస్‌, అశోక్‌, తారాసింగ్‌, అంతటికాశన్న, మధు ,వెంకటేష్‌ ,మాలిక్‌, వెంకటయ్య ,నాగరాజుగౌడ్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -