Sunday, February 8, 2026
E-PAPER
Homeదర్వాజమౌనం వేసిన వంతెన

మౌనం వేసిన వంతెన

- Advertisement -

గాలికి కనబడని సుగంధంలా…
నా అస్తిత్వమంతా నీ పరిమళమే!
రెండు వేర్వేరు తీరాల మధ్య.
మౌనం వేసిన వంతెన మన ప్రేమ.
అద్దం అడగని ప్రశ్న..
నా కళ్ళలో నీ ప్రతిబింబం
కనురెప్పల సముద్రంలో
కురిసిన వర్షం…
నేల తాకని కన్నీటి సంతకం
శబ్దానికి దొరకని భావం..
పెదవుల మధ్య చిక్కుకున్న నిశ్శబ్దం
నేల రాలిన పూలన్నీ..
మట్టి మౌనంగా చదువుకున్న కథలు

తరిగొప్పుల విఎల్లెన్‌ మూర్తి,
8008 577 834.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -