– అదో లొట్టపీసు కేసుొ మీడియాతో కేటీఆర్ వ్యాఖ్య
నవతెలంగాణ ప్రత్యేక ప్రతినిధి-హైదరాబాద్
ప్రజల దృష్టి మరల్చేందుకే ఫార్ములా ఈ-కార్ కేసులో చార్జిషీట్ దాఖలు చేశారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల ఎమ్మెల్యే కె.తారకరామారావు విమర్శించారు. అదో లొట్టపీసు కేసని చెప్పారు. ఎవరికి అనుచిత లబ్ధిచేకూర్చామని ఆరోపిస్తున్నారో, వారి పేరే అందులో లేదని గుర్తు చేశారు. ఈ కేసులో న్యాయపోరాటం చేస్తామనీ, న్యాయస్థానాలపై సంపూర్ణ విశ్వాసం ఉందని వ్యాఖ్యానించారు. రూ. 200 కోట్లతో చేపట్టిన మిస్ వరల్డ్ పోటీలతో రాష్ట్రానికి ఎన్ని పెట్టుబడులు వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. ఎన్ని చేసినా ఆరు గ్యారంటీల అమలుచేసేవరకూ పోరాడతామన్నారు. ప్రయివేటు మెంబర్ బిల్లు కచ్చితంగా పెడతామని అన్నారు. ‘ఫార్ములా ఈ కేసులో ఏమీ లేదనీ ఛార్జిషీట్లో ప్రభుత్వం మళ్లీ అంగీకరించిందని చెప్పారు. మేం కట్టింది రూ. 45 కోట్లయితే, రూ.500 కోట్లు, రూ.600 కోట్లు అని చెబుతున్నారని అన్నారు. విధానపరమైన లోపం ఉన్నట్టుగా ఛార్జిషీట్ ద్వారా తెలుస్తోందన్నారు. తప్పు జరిగితే బ్యాంకు ఖాతాలోని డబ్బును ఎందుకు రికవరీ చేయలేదని ప్రశ్నించారు. ఈ కేసులో ఏమీ లేదనీ నేను మొదట్నుంచీ చెబుతున్న విషయాన్ని ప్రభుత్వం ధృవీకరించిదన్నారు. ఎలక్ట్రిక్ వాహనాల విషయలో హైదరాబాద్‌ను ప్రపంచపటంల పెట్టేందుకు చేసిన ప్రయత్నమే ఫార్ములా ఈకార్ రేస్ అని కేటీఆర్ పేర్కొన్నారు. ఈ విషయంలో నేనే నిర్ణయం తీసుకున్నా, ప్రతీకారం తీర్చుకోవాలనుకుంటే నామీద కేసు పెట్టండీ, అంతేగానీ సీనియర్ ఐఏఎస్‌లను ఇబ్బంది పెట్టడం సరికాదని వ్యాఖ్యానించారు. కేసులో పసలేదని చెప్పారు. ఇందులో రూపాయి కాదు, అరపైసా కూడా దుర్వినియోగం కాలేదన్నారు. ఇందులో ఏసీబీ ఏం తేల్చిందో చెప్పాలని డిమాండ్ చేశారు. హైదరాబాద్ ప్రతిష్టను పెంచడానికే ఈ రేసు నిర్వహించామనీ, తద్వారా రూ. 600 కోట్ల ఆర్థిక ప్రయోజనం చేకూరిందని నెల్సన్ అనే సంస్థ చెప్పిందని గుర్తుచేశారు. రెండో సారి నిర్వహించకపోవడం మూలంగా నష్టం జరిగిందని చెప్పారు. అందాల పోటీల్లో మిస్ ఇంగ్లాండ్ మిల్లా మ్యాగీని కాంగ్రెస్ నాయకులు వేశ్యలా చూశారనీ, అప్పుడు ఎందుకు కేసు పెట్టలేదని ప్రశ్నించారు. ఆరు గ్యారంటీల విషయంలో రాజీపడబోమన్నారు. ఈ కార్ రేసు కేసుల్లో అన్నీ వివరాలతో ఒకటి,రెండు రోజుల్లో సీఎంకు లేఖ రాయనున్నట్టు చెప్పారు.
ప్రజల దృష్టి మరల్చేందుకే ఫార్ములా ఈ -కార్ కేసులో చార్జిషీట్
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



