ఎంపీటీసీ, జెడ్పిటిసి, టికెట్ల కోసం ఆశావహుల ఆరాటాలు షురూ
నవతెలంగాణ – మద్నూర్
ఏట్టికేలకు స్థానిక సంస్థలు ఎన్నికలకు ఎన్నికల కమిషన్ నగారా మోగించింది ముందుగా ఎంపిటిసి, జెడ్పిటిసి, ఎన్నికలు జరుగుతాయని తెలిపింది. ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికలకు పార్టీల పరంగా టికెట్లు అవసరం ఈ ఎన్నికల కోసం ఆశ మాహూలు ఆరాటాలు షురూ చేశారు జడ్పిటిసి ఎంపిటిసి ఎన్నికల్లో త్రిముఖ పోటీలు జరగనున్నాయి. అధికార కాంగ్రెస్ పార్టీ అలాగే ప్రతిపక్షాలైన బిఆర్ఎస్, బిజెపి, పార్టీల అభ్యర్థుల మధ్య పోటీ జరగనున్నాయి. ఆయా పార్టీల టికెట్ల కోసం ముమ్మర చర్చలు ప్రారంభించారు రిజర్వేషన్ల ప్రకారం ఎంపీటీసీ జెడ్పిటిసిల టికెట్లకు ఆయా పార్టీలలో నాయకులు ఐ కమాండ్ దగ్గర ముమ్మర ప్రయత్నాల కోసం పరుగులు తీస్తున్నట్లు తెలిసింది.
మద్నూర్ మండలంలో 12 ఎంపీటీసీ స్థానాలు ఒక జెడ్పిటిసి స్థానం కోసం మూడు పార్టీల లో పోటీదారులు టికెట్ల సాధన కోసం రికమండ్లు ప్రారంభించినట్లు తెలుస్తోంది. ఎంపీటీసీ స్థానాల్లో జెడ్పిటిసి స్థానానికి గెలుపు గుర్రాల కోసం ఆయా పార్టీల హైకమాండ్ అన్ని రకాలుగా ఆలోచనలు చేస్తున్నట్లు సమాచారం స్థానిక సంస్థల్లో అధికార పార్టీ లో పోటీ చేసేందుకు నాయకుల ముమ్మర పోటీ తత్వమున్నట్లు తెలుస్తోంది. ఈ మండలంలో ఎంపీపీ జడ్పిటిసి స్థానాలకు బిసి జనరల్ రావడం టికెట్ల సాధన కోసం అన్ని పార్టీల్లో పోటీ తత్వం అధికంగా కనిపిస్తోంది. ఏది ఏమైనా స్థానిక సంస్థలు ఎన్నికల కోసం ఎన్నికల కమిషన్ నగర మోగించడంతో ఎక్కడ చూసినా ఎన్నికల చర్చలే వినబడుతున్నాయి.
స్థానిక సంస్థలు ఎన్నికలకు మోగిన నగారా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES