నవతెలంగాణ – మద్నూర్
రైతు రాజులా బతకాలన్నదే రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సంకల్పం అని మద్నూర్ మండల సర్పంచులు తెలిపారు. రైతు భరోసా నిధుల విడుదల రాష్ట్రంలోని 70 లక్షల మంది అన్నదాతల ఖాతాలోకి రైతు భరోసా నిధులు విడుదలలైన సంగతి తెలిసిందే. మూడు విడతల్లో రూ.9000 కోట్లు పెట్టుబడి సాయం సిద్దిపేటలో నిర్వహించే సభకు మద్నూర్ నుండి సిద్దిపేటకు సర్పంచ్ తోపాటు గ్రామస్థులు బయలుదేరి వెళ్లారు.
రైతులు ఈ సందర్భంగా పలువురు మండల సర్పంచులు మాట్లాడుతూ.. రాష్ట్ర ముఖ్యమంత్రి రైతన్న శ్రేయస్సు కోసం కృషి చేస్తున్నారని తెలిపారు. ముఖ్యమంత్రి సభ విజయవంతం కోసం మండలం నుండి బస్సుల్లో రైతులు బయలుదేరారు. తడిఈపర్గా సర్పంచ్ అశ్విని సుదర్శన్ మున్నా ,మేనూర్ సర్పంచ్ అశోక్ పటేల్, కాంగ్రెస్ నాయకులు మద్నూర్ గ్రామ రైతులు కర్ల వార్ సాయిలు,తుమవార్ రాములు,తుమవార్ గంగారం,గంగాధర్ మండలంలోని వివిధ గ్రామాల తర రైతులు సిద్దిపేట సభకు తరలి వెళ్లారు.



