నవతెలంగాణ – ముధోల్
బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయంలో సోమవారం జరిగిన మూల నక్షత్రం సందర్భంగా నిర్మల్ జిల్లా కలెక్టర్ అభిలాష అభినవ్ దంపతులు అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ క్రమంలో ఆలయ అర్చకులు వేదమంత్రాల నడుమ ఘన స్వాగతం పలికారు. అనంతరం వారికి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. మూల నక్షత్రం పర్వదినం సందర్భంగా వేలాది మంది భక్తులు బాసర సరస్వతి అమ్మవారి దర్శనానికి రానున్నారని తెలిపారు. భక్తుల రద్దీ దృష్ట్యా ముందుగానే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని తెలిపారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. అనంతరం భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాలను కలెక్టర్ స్వయంగా ఆలయ ప్రాంగణంలో పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అధికారులు, సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు.
అమ్మవారిని దర్శించుకున్న కలెక్టర్ దంపతులు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES