- Advertisement -
నవతెలంగాణ – వీర్నపల్లి
వీర్నపల్లి మండలం వన్ పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు ఎదురుగా ఉన్న దివ్యాంగురాలైన మహిళ తన ఇంటికి వెళ్ళేందుకు నాలా అడ్డుగా ఉంది. తనకు మంచినీటి కనెక్షన్ ఇవ్వలేదని, తన పురాతన పెంకుటిల్లు ఉన్నదని, ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలని కలెక్టర్ కు విన్నవించారు. వెంటనే స్పందించిన కలెక్టర్ సందీప్ కుమార్ ఝా.. నాలాపై సిమెంట్ దిమ్మెను ఏర్పాటు చేయాలని, దివ్యాంగురాలుకు నల్లా కనెక్షన్ ఇవ్వాలని ఆదేశించారు. వన్ పల్లి ఇందిరమ్మ ఇండ్ల గ్రామ కమిటీ సభ్యులకు ఇలాంటి సమస్యలు ఉన్న పేదవారిని మరోసారి పరిశీలించి ప్రతిపాదనలు సమర్పించాలని కలెక్టర్ సూచించారు.
- Advertisement -