మాజీ మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి
ఆర్జాల బావి పీఏసీఎస్ కొనుగోలు కేంద్రం పరిశీలన
నవతెలంగాణ – నల్లగొండ టౌన్
నల్లగొండ జిల్లాలో ఎక్కడ చూసినా హృదయవిదారక దృశ్యాలే కనిపిస్తున్నాయని, పంటలు నష్టపోయి పుట్టెడు ద్ణుఖంలో రైతులు విలవిలలాడుతున్నారని మాజీమంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీశ్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం నల్లగొండ జిల్లాకేంద్ర సమీపంలోని ఆర్జాలబావి వద్ద ఏర్పాటు చేసిన పీఏఎస్ కొనుగోలు కేంద్రంలో తడిసిన ధాన్యాన్ని నల్లగొండ మాజీ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్‌రెడ్డితో కలిసి ఆయన పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రభుత్వం చేతకానితనం ఓ వైపు, ప్రకృతి ప్రకోపం మరో వైపు అన్నదాతలు బలైపోతుంటే జిల్లా మంత్రులు కమీషన్లు, సంపద మీదనే దృష్టి సారించారని విమర్శించారు.
మంత్రులది దోచుకోవడం మీదనే దృష్టి పెట్టి రైస్ మిల్లర్ల వద్ద కోట్ల రూపాయలు లంచాలు మింగి వారికి సాగిలపడ్డారని విమర్శించారు. దీని ఫలితంగా మిల్లర్లు రైతులను పిక్కు తింటున్నారన్నారు. ఎక్కడ చూసినా మొలకలు వచ్చిన ధాన్యం కనబడుతుందని అన్నారు. అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం రైతులను ఏడిపిస్తున్నదని తెలిపారు. తడిసిన ధాన్యాన్ని కూడా షరత్లుల్లేేకుండా కొనాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు తండు సైదులు గౌడ్, గ్రంథాలయం మాజీ చైర్మెన్ రేగట్టె మల్లికార్జున్ రెడ్డి, కౌన్సిలర్లు అభిమన్యు శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వానిది చేతగానితనం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



