Monday, August 18, 2025
E-PAPER
spot_img
Homeఆదిలాబాద్ పేద వారందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

 పేద వారందరికీ సన్నబియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యం..

- Advertisement -

నవతెలంగాణ – జన్నారం
పేదవారికి సన్న బియ్యం అందించడమే కాంగ్రెస్ ప్రభుత్వ  లక్ష్యమని తెలంగాణ గిరిజన కార్పొరేషన్ చైర్మన్ కోట్నాక తిరుపతి అన్నారు. శుక్రవారం జన్నారం మండల కేంద్రంలోని జిసిసి సెంటర్ ద్వారా పేదలకు మూడు నెలలకు సంబంధించిన సన్న బియ్యం పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. సందర్భంగా వారు మాట్లాడుతూ సన్న బియ్యం   వాటితో పాటు నిత్యవసర సరుకులను అందించారు. గిరిజన హాస్టల్ లో ప్రారంభమైనందున వారికి అవసరమైన సరుకులను అందిస్తామన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం గిరిజనులకు అండగా ఉంటుందన్నారు. జీసీసీల ద్వారా గిరిజనులకు ప్రజలకు నాణ్యమైన సరుకులనే అందిస్తామన్నారు. కార్యక్రమంలో జిసిసి డివిజనల్ మేనేజర్ సందీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad