Monday, December 22, 2025
E-PAPER
Homeకరీంనగర్నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం

నిలిచిన పంచాయతీ భవన నిర్మాణం

- Advertisement -

-అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమా..?
– పాఠశాల ముందే ప్రజాప్రతినిధుల ప్రమాణ స్వీకారం
నవతెలంగాణ – రాయికల్

మండలంలోని మంక్త్యానాయక్ తండాలో పంచాయతీ భవన నిర్మాణం ఏళ్లుగా నిలిచిపోయింది. కాంట్రాక్టర్ ముందుకు రాలేదన్న కారణాన్ని చూపుతూ అధికారులు చేతులు దులుపుకోవడం తప్ప ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోకపోవడం తీవ్ర విమర్శలకు దారితీస్తోంది. పంచాయతీకి సొంత భవనం లేకపోవడంతో  నూతనంగా ఎన్నికైన సర్పంచ్ మాలోత్ తిరుపతి, వార్డు సభ్యులు సోమవారం ప్రభుత్వ పాఠశాల అదనపు తరగతి గది ముందే ప్రమాణ స్వీకారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది.

ఇది గ్రామ అభివృద్ధిపై అధికారుల నిర్లక్ష్యానికి ప్రత్యక్ష నిదర్శనంగా మారిందని గ్రామస్తులు వ్యాఖ్యానిస్తున్నారు. కనీసం తాత్కాలిక అద్దె భవనం కూడా ఏర్పాటు చేయకపోవడం అధికారుల బాధ్యతారాహిత్యాన్ని ప్రశ్నిస్తున్నది. పంచాయతీ భవనం లేకుండా గ్రామ పాలన ఎలా సాగుతుందనే సందేహం ప్రజల్లో వ్యక్తమవుతోంది. తండా అభివృద్ధిపై పాలక యంత్రాంగానికి నిజంగా చిత్తశుద్ధి ఉందా..? లేక గిరిజన తండాలపై వివక్ష కొనసాగుతోందా..? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి పంచాయతీ భవన నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించాలని, లేనిపక్షంలో తాత్కాలికంగా అయినా సరైన వసతులు కల్పించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -