అమెరికాకు భారత్ తలొగ్గింది : లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై చర్చలో రాహుల్ గాంధీ
నవతెలంగాణ-న్యూఢిల్లీ బ్యూరో
”దేశాన్ని అమ్మేశారు. అమెరికాకు భారత్ తలొగ్గింది. అమెరికాతో వాణిజ్య ఒప్పందంతో 140 కోట్ల ప్రజానీకం భవిష్యత్తును పణంగా పెట్టారు. ఇది సిగ్గు చేటు. మనం చమురు ఎక్కడ నుంచి కొంటామో అమెరికా నిర్ణయిస్తుందా? ఏ ప్రధాన మంత్రి కూడా ఇలా చేయలేదు. వాణిజ్య ఒప్పందం పేరుతో మీరు (మోడీ సర్కార్) పూర్తిగా లొంగిపోయా రు’ అని ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ విరుచుకుపడ్డారు. లోక్‌సభలో కేంద్ర బడ్జెట్‌పై జరుగుతున్న చర్చల్లో ఆయన తీవ్ర విమర్శలు గుప్పించారు. ”అమెరికాతో ట్రేడ్ డీల్‌లో ఎలాంటి లాజిక్ లేదు. భారత్ ఎలాంటి దామాషా ప్రయోజనాలు పొందకుం డానే సాగిలపడింది. ఇరుదేశాల మధ్య కుదిరిన వాణిజ్య ఒప్పందం అమెరికాకే మేలు చేసేలా ఉంది. దానివల్ల భారత్‌కు ఎలాంటి ప్రయోజనం లేదు. చమురును ఇరాన్ నుంచో, రష్యా నుంచో, మరో చోట నుంచో కొనుగోలు చేయాలని అమెరికా ఎలా నిర్ణయిస్తుంది? మీరు భరతమాతను అమ్మేశారు. సిగ్గుపడాలి. అమెరికా ఒత్తిడితో మోడీ వణికిపోయారు” అని రాహుల్ గాంధీ ధ్వజమెత్తారు. అమెరి కా కంపెనీల కోసం కేంద్రం ట్యాక్స్ హాలిడే ప్రకటించిందని విమర్శించా రు. ”వాళ్లు చెప్పినట్టు చేయకపోతే 50 శాతం టారిఫ్‌లు వేస్తామని బెదిరిస్తో ంది. అమెరికా డిమాండ్లకు తలొగ్గి కీలక వ్యవసాయ ఉత్పత్తులకు భారత్ ద్వారాలు తెరిచింది. భారత ఉత్పత్తులపై ఒకప్పుడు కేవలం 3 శాతం పన్ను ఉండేది. ఇప్పుడు అది 18 శాతానికి చేరింది. అమెరికా దిగుమతులను 46 బిలియన్ డాలర్ల నుంచి 100 బిలియన్ డాలర్లకు పెంచేశారు. భారత్‌కు ఈ ఒప్పందం ఎలాంటి భరోసా ఇవ్వడం లేదు” అని అన్నారు. ‘ప్రధానమంత్రి కండ్లల్లో భయం కనిపిస్తోంది. అమెరికా దిగుమతులు 46 బిలియన్ డాలర్ల నుంచి 146 బిలియన్ డాలర్లకు పెరుగుతాయి. మనకు మాత్రం ఎలాంటి కమిట్‌మెంట్ ఇవ్వలేదు. మనం మాత్రం వారికి కమిట్‌మెంట్ ఇచ్చాం. మనం ఫూల్స్‌లా నిలబడ్డాం’ అని రాహుల్ తప్పుపట్టారు. మార్షల్ ఆర్ట్స్‌లో వ్యక్తులు పట్టుకోల్పోయి, సరెండర్ అయినట్టే, రాజకీయాల్లో కూడా కొందరు సరెండర్ అవుతుంటారని మండిపడ్డారు. పార్లమెంటుకు మోడీ ముఖం చాటేయడం ఎలాంటి ఆశ్చర్యం కలిగించడం లేదని వ్యాఖ్యానించారు.
దేశాన్ని అమ్మేశారు
- Advertisement -
- Advertisement -



