నిరంతరం ప్రజాసమస్యలపై అభ్యర్థులను గెలిపించాలి : పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ- వనపర్తి
రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో సీపీఐ(ఎం) పోటీ చేస్తుందని, నిత్యం ప్రజల కోసం పోరాటం చేసే తమ పార్టీ అభ్యర్థులను ఓట్లు వేసి గెలిపించాలని ఓటర్లకు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ విజ్ఞప్తి చేశారు. వనపర్తి జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయూ జిల్లా కార్యాలయంలో శుక్రవారం జి.బాలస్వామి అధ్యక్షతన పార్టీ పట్టణ కమిటీ సమావేశం జరిగింది. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజాసమస్యలపై నిరంతరం తమ పార్టీ పోరాటం చేస్తోందన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మున్సిపాల్టీల్లో తమ పార్టీ బలంగా ఉన్న ప్రాంతాల్లో సీపీఐ(ఎం) అభ్యర్థులను నిలబెడుతామని, తమకు మద్దతు ఇవ్వాలని కోరారు. వనపర్తి జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లోనూ పోటీలో ఉంటామని తెలిపారు.
పట్టణాల్లో నివాస ప్రాంత సమస్యలపై పనిచేసేందుకు అవకాశం ఇవ్వాలన్నారు. నిరంతరం కార్మికులు, రైతులు, వ్యవసాయ కార్మికులు, ఉద్యోగులు, మధ్యతరగతి ప్రజలు తదితర ప్రజాసమస్యలపై సీపీఐ(ఎం) పని చేస్తోందన్నారు. వార్డుల్లో డ్రయినేజీలు, నీరు, విద్యుత్ సమస్య, రోడ్లు, పార్కులు, వార్డుల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో సీపీఐ(ఎం) వనపర్తి జిల్లా కార్యదర్శి పుట్ట ఆంజనేయులు, జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు ఎండి.జబ్బార్, డి.బాల్‌రెడ్డి, ఎమ్.రాజు, ఏ.లక్ష్మ, వనపర్తి పట్టణ కార్యదర్శి ఎం.పరమేశ్వర చారి, నాయకులు డి.కురుమయ్య, ఏ.రమేష్, జి.గట్టయ్య, బీసన్న, గంధం మదన్, జి.బాలరాజు, రాబర్ట్, సాయిలీల, ఉమా ఉన్నారు.



