Saturday, January 24, 2026
E-PAPER
Homeరాష్ట్రీయం31న నిరుద్యోగుల సింహగర్జనకు సీపీఐ(ఎం) మద్దతు

31న నిరుద్యోగుల సింహగర్జనకు సీపీఐ(ఎం) మద్దతు

- Advertisement -

సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌

జాబ్‌నోటిఫికేషన్లు విడుదల చేయాలని డిమాండ్‌ చేస్తూ ఈ నెల 31న ఇందిరా పార్కు వద్ద తెలంగాణ నిరుద్యోగ జేఏసీ తలపెట్టిన నిరుద్యోగుల సింహగర్జనకు మద్దతిస్తున్నట్టు సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ప్రక టించారు. ఇందుకు సంబంధించిన పోస్టర్‌ను శుక్రవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయం(ఎంబీభవన్‌)లో ఆవిష్కరించారు. ఈ సంద ర్భంగా జాన్‌వెస్లీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ తాము అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే 2 లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామని ప్రకటించి ఆ మాటను నిలబెట్టుకోలేదని విమర్శించారు. ఏటా విడుదల చేస్తామన్న జాబ్‌ క్యాలెండర్‌ ప్రస్తావన లేదని తెలిపారు. పోస్టులు భర్తీ చేస్తారనే ఆశతో విద్యార్థులు కోచింగ్‌ సెంటర్లకు వెళ్తున్నారనీ, స్టడీ హాళ్లలో రేయింబవళ్లు చదువుతున్నారని తెలిపారు. నోటిఫికేషన్లు రాక వారు నైరాశ్యంలోకి కూరుకుపోతున్నారనీ, ఆర్థికపరమైన ఇబ్బందులను సైతం ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వం ఇస్తానన్న నిరుద్యోగ భతి ఏమైందని ప్రశ్నించారు. ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేయాలనీ, ప్రభుత్వ శాఖల్లోని ఖాళీలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్‌ చేశారు. డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షులు కోట రమేశ్‌, ఎస్‌ఎఫ్‌ఐ నగర కార్యదర్శి అశోక్‌రెడ్డి, సీపీఐ(ఎం) నాయకులు ఉడుత రవీందర్‌, విజరుకుమార్‌, నిరుద్యోగ జేఏసీ చైర్మెన్‌ మోతీలాల్‌ నాయక్‌, నాయకులు ఆకాశ్‌, నవీన్‌, పండు, అనిల్‌, శ్రీకాంత్‌ నాయక్‌, బాషా, రమేశ్‌, తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -