విరాట్ కర్ణ హీగా అభిషేక్ నామా దర్శకత్వం వహిస్తున్న పాన్ ఇండియా మూవీ ‘నాగబంధం’. ఈ వేసవిలో విడుదలకు సిద్ధమవుతోంది. ఈ నెల15న మహా శివరాత్రి శుభ సందర్భాన్ని పురస్కరించుకుని ఈ చిత్ర టీజర్ విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ఈ ఇతిహాస కథనంలోని మరో కీలక పాత్ర ఫస్ట్‌లుక్‌ను మేకర్స్ రిలీజ్ చేశారు. బాలీవుడ్ ‘ఫైటర్’లో తన అద్భుతమైన ప్రజెన్స్‌తో ఆకట్టుకున్న రిషబ్ సాహ్నీ ఈ చిత్రంలో ఆఫ్ఘన్ సుల్తాన్ అబ్దాలి పాత్రను పోషించాడు.
1750లో బ్యాక్ డ్రాప్‌లోని ఈ చిత్రంలో భారత్‌లో అబ్దాలీ చేసిన దండయాత్రలు, దేవాలయాల దోపిడీ, అపార సంపద కోసం అతడు చేసిన క్రూర ప్రయత్నాలను చూపించబోతున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ పవర్‌ఫుల్‌గా ఉంది. అబ్దాలి చరిత్రలో అత్యంత నిర్దయుడిగా ప్రసిద్ధి చెందిన వ్యక్తి కావడం విశేషం. రిషబ్ నటనపై దర్శకుడు అభిషేక్ నామా ప్రశంసలు కురిపించారు. ‘రిషబ్ చేసిన నటన చూస్తే, అబ్దాలీనే తెరపై జీవించినట్టుగా అనిపిస్తుంది’ అని అన్నారు.’అబ్దాలీ లాంటి సవాలుతో కూడిన పాత్రను పోషించడం గౌరవంగా భావిస్తున్నాను’ అని రిషబ్ చెప్పారు. నభా నటేష్, ఐశ్వర్య మీనన్ కథానాయికలుగా నటిస్తుండగా, జగపతి బాబు, జయప్రకాష్, మురళి శర్మ, బి.ఎస్.అవినాష్ వంటి ప్రముఖ నటీనటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
అత్యంత క్రూరుడు..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



