Saturday, March 7, 2026
E-PAPER
Homeతెలంగాణ రౌండప్తురక కాశ రుణాలకు గడువు పెంచాలి..

తురక కాశ రుణాలకు గడువు పెంచాలి..

- Advertisement -

టికే ఎస్ ఎస్ ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి
నవతెలంగాణ – ఆత్మకూరు

తురక కాశ బండ కార్మికులకు పనిముట్లు, జనరేటర్ రుణ దరఖాస్తులకు మరో వారం గడువు పొడిగించాలని తెలంగాణ తురక కాశ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయ్యద్ వలి ప్రభుత్వాన్ని కోరారు. సంఘం వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షుడు షేక్ ఇమామ్ పాషా అధ్యర్థిత రాష్ట్ర కమిటీ సభ్యులు శుక్రవారం సచివాలయంలో మైనార్టీ శాఖ మంత్రి ముహమ్మద్ అజారుద్దీన్‌కు మెమోరెండం సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా 6 లక్షల తురక కాశ కార్మికులు ఉన్నారని, గత వారం ప్రభుత్వం ఇచ్చిన గడువులో కుల సర్టిఫికెట్లు, ఆన్‌లైన్ దరఖాస్తుల్లో ఇబ్బందులు ఎదురయ్యాయని తెలిపారు.

“మరో వారం గడువు పొడిగిస్తే పూర్తిస్థాయిలో లబ్ధి చేకూరుతుంది. అలాగే, 5,000 పనిముట్లు, జనరేటర్ యూనిట్లు కేటాయించాలి” అని మంత్రిని విజ్ఞప్తి చేశారు. గత 10 సంవత్సరాలు మునుపటి ప్రభుత్వాలు తమకు ప్రత్యేక రుణాలు కల్పించలేదని, కానీ కాంగ్రెస్ రేవంత్ రెడ్డి ప్రభుత్వం గుర్తించి సహాయం చేసినందుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా మంత్రి అజారుద్దీన్ సానుకూలంగా స్పందించి, “అన్ని విషయాలు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తాను” అని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షుడు సయ్యద్ హైదర్ (సిద్దిపేట), షేక్ మౌలానా తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -