Monday, October 13, 2025
E-PAPER
Homeసినిమావీరాభిమాని విశ్వరూపం..

వీరాభిమాని విశ్వరూపం..

- Advertisement -

హీరో రామ్‌ పోతినేని తాజాగా నటిస్తున్న చిత్రం ‘ఆంధ్ర కింగ్‌ తాలూకా’. మహేష్‌ బాబు పి దర్శకుడు. మైత్రి మూవీ మేకర్స్‌ నిర్మిస్తోంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రొడక్షన్‌ చివరి దశలో ఉంది. భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటించగా, ఉపేంద్ర ఆన్‌-స్క్రీన్‌ సూపర్‌ హీరోగా కనిపించనున్నారు. ఆదివారం మేకర్స్‌ చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు. రామ్‌ క్యారెక్టర్‌, సినిమా కథాంశం గురించి ఒక గ్లింప్స్‌ ఇచ్చారు. రామ్‌ సినిమాలను ఆరాధిస్తూ, ఆంధ్ర కింగ్‌ ఉపేంద్రని ఆరాధిస్తూ పెరుగుతాడు. అంకితభావంతో ఉన్న అభిమానిగా, అతను తన అభిమాన స్టార్‌ విజయాలను సెలబ్రేట్‌ చేసుకుంటాడు. అతనిని సమర్థిస్తూ గొడవల్లో కూడా పాల్గొంటాడు. అతను తన హీరోని ఎంతగా ప్రేమిస్తాడో, అంతే తీవ్రంగా అతన్ని ప్రేమించే ఒక అమ్మాయి ఉంది.

మురళి శర్మ చెప్పిన హార్డ్‌ హిట్టింగ్‌ డైలాగ్‌తో టీజర్‌ ముగుస్తుంది. తన తొలి చిత్రంతోనే మంచి హిట్‌ ఇచ్చిన దర్శకుడు మహేశ్‌ బాబు పి ఈసారి మరో యూనిక్‌ కథను అందిస్తున్నారు. ఆయన డైలాగ్స్‌ బలంగా ప్రేక్షకుడికి కనెక్ట్‌ అవుతున్నాయి. ఇది సినిమాను వేడుకలా జరుపుకునే చిత్రం. ఫుల్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌ ఇచ్చే ఈ టీజర్‌ ప్రేక్షకుల్లో మంచి ఆసక్తిని రేకెత్తించింది. భారీ అంచనాలతో నవంబర్‌ 28న ఈ సినిమా థియేటర్లలో విడుదల కానుంది అని చిత్ర యూనిట్‌ తెలిపింది. ఈచిత్రానికి కథ – స్క్రీన్‌ప్లే – దర్శకత్వం: మహేష్‌ బాబు పి., నిర్మాతలు: నవీన్‌ యెర్నేని, వై. రవిశంకర్‌, సమర్పణ: గుల్షన్‌ కుమార్‌, భూషణ్‌ కుమార్‌, టి-సిరీస్‌ ఫిలిమ్స్‌, సిఇఓ : చెర్రీ, ఎగ్జిక్యూటివ్‌ నిర్మాత: హరి తుమ్మల.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -