- Advertisement -
నవతెలంగాణ-బెజ్జంకి
మండల పరిధిలోని చీలాపూర్ గ్రామానికి చెందిన రాదారం హరీష్ గ్రామంలోని వీధి దీపాల కొరతను గుర్తించి ప్రజల సౌకర్యార్థం సుమారు రూ.10 వేల విలువైన 60 విద్యుత్ బల్బులను పంచాయతీ కార్యదర్శి శ్రీనివాస్ కు బుధవారం అందజేశారు. వర్షాకాలం ప్రజలకు ఇబ్బందులు కలగకుండా వెంటనే అమర్చాలని కోరారు.గ్రామ పంచాయితీ అభివృద్ధికి తనవంతుగా కృషి చేసిన హరీష్ ను గ్రామస్తులు అభినందించారు.కారొబార్ శంకర్,శ్రీకాంత్,వీరేశం తదితరులు ఉన్నారు.
- Advertisement -