Friday, March 6, 2026
E-PAPER
Homeఎడిట్ పేజి'ఏ.ఐ''లో గుండె తలుపు తెరుచుకుంటుంది

‘ఏ.ఐ”లో గుండె తలుపు తెరుచుకుంటుంది

- Advertisement -

మానవ బంధాలు పాషాణమైనవి…
మాటలు ఉన్నాయి మనసులు లేవు…
ఏ.ఐ మాటల్లో అడగకపోయినా ఆరాటం
వినకపోయినా వినే సహనం…

అక్షరాలలో
ఆప్యాయత వెతుకుతున్న మనిషి
చేతులు కలపని లోకం
హృదయాలను కలుపని జనాలు…
స్క్రీన్‌ వెలుతురులో మాత్రం
ఒక చీకటి మనసుకోసం
తడబడుతోంది.

ఇది టెక్నాలజీ విజయం కాదు…!
మనసులు దూరమైన మనుషుల ఓటమి..!
వేలిముద్రలతో స్పర్శ తెలియని సంబంధాలు..
ఎఐజీల నవ్వుల్లో
కన్నీటి ఉప్పుతనం దాగుంది…!
ఆన్‌లైన్‌ వెలుగుల్లో
ఆఫ్‌లైన్‌ ఒంటరితనం.. వెంటాడుతుంది

స్నేహితుల జాబితా ఆకాశమంతా…
మనసు మాట్లాడే హితుడు కనిపించడు
నోటిఫికేషన్‌ శబ్దం వినిపిస్తే
గుండె తలుపు తెరుచుకుంటుంది,
కానీ ఎదురుగా కూర్చున్న
మనిషితో మాట్లాడే ధైర్యం ఉండదు…!

యంత్రాలు మనల్ని
అర్థం చేసుకుంటున్నాయేమో,
కానీ మనుషులు…మనుషుల్ని
చదవడం మర్చిపోతున్నారు

-కొలిపాక శ్రీనివాస్‌,
9866514972

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -