Friday, February 20, 2026
E-PAPER
Homeఖమ్మంప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధులు కర్తవ్యం 

ప్రజాసమస్యల పరిష్కారమే ప్రజాప్రతినిధులు కర్తవ్యం 

- Advertisement -

– మున్సిపల్ ఛైర్పర్సన్,డిప్యూటీ ఛైర్పర్సన్ ల విధుల స్వీకరణ లో ఎమ్మెల్యే జారె
నవతెలంగాణ – అశ్వారావుపేట

ప్రజా ప్రాతినిధ్య బాధ్యత ఎంతో ఉన్నతమైందని,ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించడం పట్టణ అభివృద్ధికి కట్టుబడి పని చేయడం ప్రతి ప్రజాప్రతినిధి కర్తవ్యం అని ఎమ్మెల్యే జారె ఆదినారాయణ మున్సిపల్ కౌన్సిలర్ లకు గుర్తు చేశారు.  మున్సిపల్ నూతన పాలకవర్గం పురపాలక సంఘ కార్యాలయం లో శుక్రవారం విధులు స్వీకరించిన సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మున్సిపల్ దంపతుల కు అభినందనలు తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ అభివృద్ధి  లబ్ధి ప్రతి కుటుంబానికి చేరేలా కృషి చేయాలని సూచించారు. పట్టణంలో పారిశుద్ధ్యం మెరుగు ,తాగునీరు సక్రమ సరఫరా, అంతర్గత రహాదారులు నిర్వహణ,వీధి దీపాలు ఏర్పాటు ,పేద మధ్యతరగతి కుటుంబాల అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి సారించాలని కోరారు.ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టే విధంగా పారదర్శకంగా బాధ్యతాయుతంగా సేవ చేయాలని కాంక్షించారు.

కమిషనర్ నాగరాజు ఆద్వర్యంలో జరిగిన మొదటి సమావేశంలో పట్టణంలో నెలకొన్న పలు సమస్యలు పై చర్చించారు.ఆయా సమస్యలు పరిష్కారానికి తగు ప్రణాళిక లు రూపొందించాలని కమీషనర్ ను  ఛైర్పర్సన్ , డిప్యూటీ ఛైర్పర్సన్ లు  జూపల్లి శశికళ రమేష్ బాబు దంపతులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కౌన్సిలర్ లు డేరంగుల ప్రసాద్, దగ్గుమల్లి మౌనిక,చిన్నంశెట్టి శ్రీను,కట్టా సింధూజ,కొట్టే నాగసునీత, ఎస్కే రెహనా, కారం కనకదుర్గ, నూర్జహాన్,మిండ హరిబాబు,నార్లపాటి మహేష్,అట్టం రమ్య, దండాబత్తుల ఆదిలక్ష్మి,మోర్ల రాజేశ్వరి,తిరుమలశెట్టి వెంకన్నబాబు,నార్లపాటి దివాకర్ లు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -