Wednesday, January 7, 2026
E-PAPER
Homeప్రత్యేకంవెండితెరపై పంజాబ్‌ మట్టి పరిమళం

వెండితెరపై పంజాబ్‌ మట్టి పరిమళం

- Advertisement -

– షర్మిలా ఠాగూర్‌

ఇటీవల కన్నుమూసిన హిందీ హీరో ధర్మేంద్ర గురించిన జ్ఞాపకాలను ఆయన సహనటి, హీరోయిన్‌ షర్మిల ఠాగూర్‌ ఇలా నెమరు వేసుకున్నారు.

దశాబ్దాల తరబడి భారతీయ సినిమాపై ధర్మేంద్ర ప్రభావం బలమైనది. మారుతున్న హిందీ సినిమా దశ్యాన్ని విస్తరించిన వ్యక్తిగా ధరమ్‌ గురించి చెప్పడానికి చాలా రకాలైన, ఆసక్తికరమైన విషయాలున్నవి. స్థిరమైన తారగా ప్రకాశించిన నటుడాయన. ఎందుకంటే, అతను భారతీయ సినిమా రంగంలో ”హీమ్యాన్‌”గా ఒక గొప్ప సెలబ్రిటీ హోదాను పొందాడు. కానీ అత్యంత అందమైన తారలలో ఒకరిగా ఆరాధించబడినప్పుడు కూడా, ధర్మేంద్ర గ్లామర్‌ సినీ ప్రపంచపు మెరుపులకు పొంగిపోలేదు. ఆ మెరుగులకు ప్రభావితం కాలేదు. తన కీర్తిని వేరొకరికి చెందినదిగా భావించి తేలికగా మోసాడు.



ధరమ్‌తో పనిచేసిన నా తొలి జ్ఞాపకాలు దేవర్‌, అనుపమ చిత్రాలతో మొదలవుతాయి. అప్పుడు కూడా నన్ను ప్రభావితం చేసినది అతనిలో ఉన్న సౌమ్యతనే. తెరపై అతను ఆకట్టుకునేలా ఉండవచ్చు, అతని నటన అసాధ్యంగా ఉండవచ్చు. కానీ తెర వెలుపల అతను చాలా మదువుగా మాట్లాడేవాడు. నేను ఇంకా పరిశ్రమలో నా స్థానాన్ని వెతుక్కుంటున్న ఆ సమయంలో నా కెరీర్‌ స్థిరపడడానికి అతను తన వంతు కషి చేశాడు. ఆ సహకరించే మనస్తత్వం అతని వ్యక్తిత్వాన్ని నిర్వచిస్తుంది.
‘అనుపమ’ సినిమాలో, హషికేశ్‌ ముఖర్జీ మనకు నిగ్రహంతో నిర్మించబడిన ప్రపంచాన్ని చూపిస్తాడు. మాటల కంటే ఎక్కువగా ఆ పాత్ర కళ్ళు మాట్లాడుతాయి.
ఆ పాత్రను ఆ భాషను అవలీలగా అర్థం చేసుకుని ధర్మేంద్ర ఆ భాషను సహజంగానే నటనలో ప్రదర్శించారు. అతనికి నిశ్శబ్దాన్ని గ్రహించే సామర్థ్యం ఉంది.
ధరమ్‌ జీని ప్రత్యక్షంగా చూడటమే ఓ పాఠ్యాంశం. ధర్మేంద్ర వంటి ఒక ప్రముఖ వ్యక్తి మదుత్వంతో అంత సుఖంగా ఉండటం ఎంత అసాధారణమో నేను అనుకుంటాను. అతని వ్యక్తిత్వాన్ని నేను నొక్కి చెప్పాల్సిన అవసరం లేదు. అతను కేవలం సాధారణమైన వ్యక్తిలాగే చివరిదాకా అలాగే ఉన్నాడు. ‘సత్య కాం’ సినిమా బహుశా మేము కలిసి చేసిన సీరియస్‌ సినిమా ప్రయాణం. హషిదా సినీ ప్రపంచం నటులకు ఎప్పుడూ సులభం కాదు. దానికి నటన కాదు, నిజాయితీ అవసరం. ధర్మేంద్ర ఆ సవాలును సులభంగానే అధిగమించాడు.అది నాకు, అతని కెరీర్‌లో అత్యంత ప్రకాశవంతమైన విజయాలలో ఒకటిగా మిగిలిపోయింది. ఇప్పటికీ, నేను ‘సత్య కాం’ గురించి ఆలోచించినప్పుడు, అతని భావోద్వేగాల పారదర్శకత నాతో ఇప్పటికీ నిలిచి ఉంది.

మా కెరీర్లో కొన్ని ఆనందకరమైన సమయాలు కూడా ఉన్నాయి, అవి కూడా అంతే చిరస్మరణీయమైనవి. ”మేరే హమ్దామ్‌ మేరే దోస్త్‌” సినిమా అతనికి సహజంగా వచ్చిన ఆకర్షణతో నిండి ఉంటుంది. ఈ సినిమాలో ఆయన నటన అతని ఆకర్షణ,అతని సహజత్వం, ఉల్లాసమైన హాస్యం నుండి ఆవిష్కరింపబడింది . సెట్‌లో ఎక్కువ రోజులు పనిచేయడంలో అతనికి విసుగు విరామం వచ్చేది కాదు . సెట్లో అతడు ధర్మేంద్రగా పెద్ద హీరో అయినప్పటికీ కేవలం తను డామినేట్‌ చేసి తన పాత్రను పండించుకోవడమే ప్రధానంగా భావించడు. ఇతర తారలతో సమన్వయంతో నటనను సమిష్టి కషిగా రూపొందిస్తాడు.
ఆపై, ‘యకీన్‌’ లో ద్విపాత్రాభినయంలోని ఉల్లాసభరితమైన రహస్యం ధరం నటనాశక్తిలో ఉంది.



‘సత్యకాం’ బరువును మోసిన అదే నటుడు, కొన్ని సంవత్సరాలలో, గురుత్వాకర్షణను ధిక్కరించే తేలికతో ‘చుప్కే చుప్కే’ యొక్క అసంబద్ధతలను అలవాటు చేసుకున్నాడు. లిస్ప్‌, మాక్‌-సీరియస్‌ వక్షశాస్త్ర ప్రసంగం ప్రతి సంజ్ఞ ముందస్తుగా ఉన్నప్పటికీ పూర్తిగా అది ఆకస్మికంగా అతని నటనలో కనిపించింది. అతని చేతుల్లో హాస్యం, ద్వంద్వ పాత్రల రూపంగా మారింది. నేషనల్‌ అవార్డ్స్‌ ఇచ్చే వారి దష్టిలో చారిత్రాత్మకంగా హాస్యాన్ని కళకి సవతి బిడ్డగా పరిగణించాయని నేను తరచుగా పేర్కొంటాను. ‘సత్యకామ్‌’లో ఆ పాత్రకి వున్న నిజమైన సంక్లిష్టతను వారు అర్థం చేసుకుంటే, ధరమ్‌ పోషించిన ‘పరిమల్‌ త్రిపాఠి’ పాత్రకి జాతీయ అవార్డు వచ్చేది.

ధరమ్‌ గొప్ప సహనటుడు. గొప్ప వ్యక్తి కూడా. ‘మేరే హమ్‌ దమ్‌ మేరే దోస్త్‌’ సినిమా చిత్రీకరణ సమయంలో. టైగర్‌ (మన్సూర్‌ అలీ ఖాన్‌ తౌడి) కోల్‌కతాలో వెస్టిండీస్‌-ఇండియా టెస్ట్‌ ఆడుతున్నాడు, ఆ రోజు అతని పుట్టినరోజు. ఆ మ్యాచ్‌ కోసం కోల్‌కతాకు వెళ్లి తన పుట్టినరోజు జరుపుకోవడానికి నేను తెల్లవారుజామున విమానంలో వెళ్లాలనుకున్నాను. ధరమ్‌ రాత్రిపూట షూటింగ్‌ చేయగలరా? అని అడిగాను. అతను అంగీకరించి ఉదయం 7 గంటల వరకు షూటింగ్‌ చేశాడు. అతను ఎప్పుడూ అసౌకర్యం గురించి మాట్లాడలేదు. ఆ ఉదయం విమానం ఎక్కడానికి నాకు అవకాశం కల్పించినందుకు నేను ఇప్పటికీ అతనికి కతజ్ఞురాలను.
స్టార్‌డమ్‌ ప్రజలకు సంక్లిష్టమైన పనులు చేయగలదు. అది దూరాన్ని సష్టించగలదు. అభద్రతా భావాలను పెంచుతుంది. కానీ ధరమ్‌ మాత్రం అవన్నీంటికీ అతీతుడు. తన తోటి నటీనటులకు ఎలాంటి గౌరవం ఇస్తాడో, స్పాట్‌-బార్సు పట్ల కూడా అతను అదే ఆప్యాయతను చూపించేవాడు. హిందీ చిత్రరంగంలో పెద్ద పెద్ద నటీనటులు టేక్‌ల మధ్య కుర్చీలతో పరుగెత్తేవారు. కానీ ప్రమాదకర నిచ్చెనలపై కూర్చున్న లైట్‌-మెన్‌లపై, సెట్‌లలో వేచి ఉన్న జూనియర్‌ ఆర్టిస్టులపై తక్కువ శ్రద్ధ చూపేవారు. కానీ ధర్మేంద్ర వారిపట్ల అత్యంత ఆదరాభిమానులను చూపించేవాడు.ఆ దాతత్వం అతనికి పంజాబ్‌ నేల నుండి వచ్చింది. అదే అతన్ని పరిశ్రమలో అందరి హదయాలలో జీవింపజేసింది. సామాజిక హోదాల పట్ల ఉదాసీనంగా వుండే ధరమ్‌ ఎల్లప్పుడు కూడా నేలపైన నడయాడే సామాన్య మానవుడిగానే ప్రవర్తించాడు.

శస్త్రచికిత్స తర్వాత మేము చివరిసారిగా టెలిఫోన్‌లో మాట్లాడుకున్నాము. నేను ఆసుపత్రిలో ఉన్నప్పుడు నా ఐప్యాడ్‌లో ‘చుప్కే చుప్కే’ చూశాను. మరియు ధరమ్‌కి ఫోన్‌ చేసి అతను ఎంత తెలివైనవాడో చెప్పాను.
కాలక్రమేణా అతని సినీ ఇమేజ్‌ ఇంతింతై పై స్థాయికి వెళ్ళిపోయింది
రొమాంటిక్‌ హీరో, విషాద ఆదర్శవాది, యాక్షన్‌ స్టార్‌, ప్రియమైన ఎంటర్‌టైనర్‌ అయినప్పటికీ, ఈ ప్రతి పాత్ర పోషణల వెనుక ఒకే వ్యక్తి ధర్మేంద్ర ఉన్నాడు. జయాపజయాలు, నిరాశలనే చక్రాల వాహనంపై స్థిరపడిన సాధారణమైన నటుడుగానే మాలాంటి వారికి కనిపిస్తాడు.
స్టార్‌డమ్‌ ప్రజల దష్టిలో జీవితం కంటే గొప్పగా కనిపింప చేయగలదు. దీనికి విరుద్ధంగా ధర్మేంద్ర సామాన్య మానవుడిగా మెలగడం వల్లనే అత్యున్నతమైన వ్యక్తిత్వం గలవాడిగా చిత్రరంగంలోని వారికి కనిపిస్తాడు.

నా అత్యుత్తమ సినిమాటిక్‌ ప్రయాణాలలో కొన్నింటిని అతనితో పంచుకోవడం నా జీవితంలోని ప్రత్యేకతలలో ఒకటి. ధర్మేంద్రతో నటించిన సినిమాలన్నీ కూడా నన్ను ఒక సమగ్రమైన నటిగా రూపొందించినవి అని చెప్పుకోవడానికి నాకు ఎలాంటి భేషజం లేదు. అది మాత్రమే కాదు. నన్ను ఒక వ్యక్తిగా నన్ను సుసంపన్నం చేశాయి. ”రాకీ ఔర్‌ రాణి కీ ప్రేమ్‌ కహానీ”ని అంగీకరించనందుకు నేను ఇప్పటికీ చింతిస్తున్నాను. కోవిడ్‌, వైద్యులు నన్ను ఆపివేసాయి. ఇన్ని సంవత్సరాల తర్వాత అతనితో స్క్రీన్‌ స్పేస్‌ పంచుకోవడం అద్భుతంగా ఉండేది. ధరమ్‌తో తెరను పంచుకోవడం ఒక గొప్ప అనుభూతి.
నా సినీ జీవన ప్రయాణంలో ప్రయాణంలో అతనిలో చూసిన సౌమ్యత మరొకరికి సాధ్యం కాదు. అతన్ని తెలుసుకోవడం, అతనితో పనిచేయడం అంటే, అరుదైన స్థిరమైన నటనానుభూతిని అనుభవించడమే. అది సినిమా మాత్రమే కాకుండా, అతని పక్కన నిలబడి ఉన్న మనందరినీ ప్రభావితం చేసింది. ఎక్కడో పంజాబ్‌ పొలాలపై మధ్యాహ్నం పూట అతను ఇప్పటికీ తన కపటం లేని నవ్వును నవ్వుతున్నాడని నేను భావిస్తున్నాను. నిజంగా అతను భారతీయ చిత్రసీమలో ఒక పంజాబ్‌ మట్టి పరిమళం. వందలాది చిన్న చిన్న పట్టణాలలోని సినిమా హాళ్లలో లైట్లు మసక బారుతున్నాయి. కానీ ఎక్కడో ఒక స్వరం ‘యే దోస్తీ’ అని పాడుతూనే ఉంటుంది . అతను లేని ప్రపంచాన్ని చూసే రేపటి తరాల వారు తమకు ఎంతో నష్టం కలిగిందని మనసులలో చిన్న బాధను అనుభవిస్తారు. కళ అనే సున్నితమైన వలయంలో సత్యాన్ని బంధించడానికి మన జీవితాలను గడిపే మనం సరళంగా, నిజాయితీగా, అద్భుతంగా జీవించిన ఒక సహజమైన నటుడుగా ధర్మేంద్రను గుర్తుంచుకుంటాము.

వెండితెర చరిత్రలో అనుపమానమైన వెలుగును మోసిన సామాన్యుడు ధర్మేంద్ర. నాకేమనిపిస్తుందంటే ధరమ్‌జి స్వర్గంలోకి ప్రవేశించినప్పుడు, దేవుళ్ళు ‘చుప్కే చుప్కే’ అని నవ్వుతూ ఉంటారని నేను ఊహిస్తాను.
(వ్యాసకర్త సినీ చరిత్రకారుడు)

– హెచ్‌ రమేష్‌ బాబు, 7780736386

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -