అనిల్ అంబానీ కేసులో దర్యాప్తు
ముంబయి : అనిల్ అంబానీ గ్రూప్ మనీలాండరింగ్ ఆరోపణల విచారణలో యెస్ బ్యాంక్ సహ వ్యవస్థాపకుడు రాణా కపూర్‌ను ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ప్రశ్నించింది. మనీలాండరింగ్ నిరోధక చట్టం (ఫెమా) కింద కపూర్ వాంగ్మూలాన్ని నమోదు చేస్తున్నారు. 2017-2019 మధ్య అనిల్ అంబానీ సంస్థలకు ఎస్ బ్యాంక్ జారీ చేసిన రుణాలు, పెట్టుబడులపై ఈడీ దర్యాప్తు చేస్తోంది. రాణా కపూర్ చొరవతోనే రిలయన్స్ అనిల్ అంబానీ గ్రూపునకు 2017లో యెస్ బ్యాంక్ రూ.6,000 కోట్ల అప్పులు ఇచ్చిందనేది ప్రధాన ఆరోపణ. 2018 మార్చి నాటికి ఏకంగా రూ.13,000 కోట్ల రుణాలు ఇచ్చింది. అనంతరం ఇవి మొండి బాకీలుగా మారాయి. ఈ దెబ్బతో ఎస్ బ్యాంక్ రూ.3,300 కోట్ల నికర నష్టాలను చవి చూసింది. ప్రజల డబ్బు ఎస్ బ్యాంక్ ద్వారా పరోక్షంగా మళ్లించబడిందని ఈడీ ప్రధాన ఆరోపణ.
ఎస్ బ్యాంక్ రాణా కపూర్‌ను విచారించిన ఈడీ
- Advertisement -
- Advertisement -



