మండల ప్రత్యేక అధికారి
నవతెలంగాణ – మద్నూర్
మద్నూర్ మండలంలోని చిన్న షక్కర్గా గ్రామంలో మంజూరైన ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణంలో ఆ గ్రామ కార్యదర్శి ఆ గ్రామ సర్పంచ్ కృషి అభినందనీయమని మండల ప్రత్యేక అధికారి పేర్కొన్నారు. శుక్రవారం ఆ గ్రామాన్ని మండల ప్రత్యేక అధికారి అలాగే మండల ఎంపీడీవో సందర్శించి ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులు పరిశీలిస్తూ అక్కడ జరుగుతున్న ఇండ్ల నిర్మాణాల పనులను చూసి అధికారులు గ్రామ కార్యదర్శి గ్రామ సర్పంచ్ పనితీరుపై అభినందించారు. అనంతరం గ్రామపంచాయతీలో ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల పనులపై పరిశీలన జరిపారు. అనంతరం ఆ గ్రామపంచాయతీ పరిధిలోని పల్లె ప్రకృతి వన కేంద్రాన్ని సందర్శించారు ఆ గ్రామపంచాయతీ పరిధిలో మంజూరైన 26 ఇందిరమ్మ ఇండ్ల పనులు చురుగ్గా సాగుతున్నందున అధికారులు సంతోషం వ్యక్తపరిచారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో రాణి గ్రామ కార్యదర్శి ప్రణయ్ ఆ గ్రామ ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు గ్రామస్తులు పాల్గొన్నారు.
ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణాల్లో కార్యదర్శి, సర్పంచ్ కృషి అభినందనీయం
- Advertisement -
- Advertisement -



