Thursday, January 29, 2026
E-PAPER
Homeరాష్ట్రీయంకార్పొరేషన్ల ఎన్నికల వ్యయం 1.5లక్షలు

కార్పొరేషన్ల ఎన్నికల వ్యయం 1.5లక్షలు

- Advertisement -

మున్సిపాల్టీల్లో రూ.లక్ష వివరాలు వెల్లడించిన ఎన్నికల సంఘం

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
రాష్ట్రంలోని 7 మున్సిపల్‌ కార్పొరేషన్లు, 116 మున్సిపాల్టీల రెండవ సాధారణ ఎన్నికలకు సంబంధించి ఎన్నికల వ్యయం తదితర వివరాలను తెలంగాణ ఎన్నికల సంఘం బుధవారం వెల్లడించింది. మున్సిపల్‌ కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థి గరిష్టంగా రూ.1,50,000, మున్సిపాల్టీల్లో పోటీ చేసే అభ్యర్థులు గరిష్టం రూ.లక్ష వరకు వ్యయం చేయాలని పేర్కొంది. కార్పొరేషన్లలో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ ఫీజు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రూ.12,50, జనరల్‌కు రూ2,500, మున్సిపాల్టీల్లో పోటీ చేసే అభ్యర్థి నామినేషన్‌ పీీజు ఎస్సీ,ఎస్టీ, బీసీలకు రూ.2,500, జనరల్‌కు రూ5,000గా నిర్ణయించారు.

నామినేషన్‌ సమాచారం ఇలా..
పోటీ చేసే అభ్యర్థి సంబంధిత మున్సిపాల్టీ, మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల ఓటర్ల జాబితాలో నమోదయి ఉండాలి.
ప్రతిపాదకుడు సంబంధిత వార్డు ఓటర్ల జాబితాలో నమోదయి ఉండాలి
సంబంధిత స్థానిక సంస్థ నుండి బాకీలు లేవు (నో డ్యూస్‌) సర్టిఫికెట్‌ తప్పనిసరి
నామినేషన్‌ పత్రాన్ని అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు మాత్రమే సమర్పించాలి
ఒక వార్డు కోసం గరిష్టంగా నాలుగు నామినేషన్‌ పత్రాలు మాత్రమే దాఖలు చేయాలి
ఒక ఓటరు ఒక అభ్యర్థికి మాత్రమే ప్రతిపాదకుడిగా ఉండవచ్చు
ఒక వార్డు పదవికి ఒకటి కంటే ఎక్కువ నామినేషన్లు దాఖలు చేసినా ఒక డిపాజట్‌ మొత్తం సరిపోతుంది.
వేర్వేరు వార్డుల్లో నామినేషన్లు దాఖలు చేస్తే ప్రతి వార్డుకు వేర్వేరు డిపాజట్‌ మొత్తం చెల్లించాలి
ఆర్వో కార్యాలయంలోకి అభ్యర్థి లేదా ప్రతిపాదకుడు సహా గరిష్టంగా ముగ్గురికి మాత్రమే అనుమతి ఉంటుంది.
ఆర్వో కార్యాలయం నుంచి 100 మీటర్ల పరిధిలో ప్రతి అభ్యర్థికి రెండు వాహనాలకే అనుమతి ఉంటుంది.
అన్ని ఆర్వో కార్యాలయాలు, మున్సిపాల్టీలు, మున్సిపల్‌ కార్పొరేషన్లలో సహాయ కేంద్రం ఏర్పాటు చేయబడింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -